అభిషేక్ రాజకీయ రంగప్రవేశంపైతెరపైకి ఆసక్తికరమైన చర్చ!

సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం అత్యంత సహజమైన విషయంగా మారిపోతుందనే కామెంట్లు వినిపిస్తుంటాయి!

Update: 2023-07-16 07:57 GMT

సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం అత్యంత సహజమైన విషయంగా మారిపోతుందనే కామెంట్లు వినిపిస్తుంటాయి! ఈ క్రమంలో బాలీవుడ్ లో కూడా ఇలా సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారి నెంబర్ ఎక్కువగానే ఉంటుందని అంటుంటారు. ఈ క్రమంలో తాజాగా అభిషేక్ బచ్చన్ పేరు తెరపైకి వచ్చిందని తెలుస్తుంది.

అవును... బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లు కథనాలొస్తున్నాయి. తండ్రి అమితాబ్‌ బచ్చన్‌ పోటీ చేసిన స్థానం నుంచే ఆయన బరిలో దిగనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సమాజ్‌ వాదీ పార్టీ తరఫున యూపీలోని ప్రయాగ్‌ రాజ్‌ లోక్‌ సభ స్థానం నుంచి అభిషేక్‌ పోటీ చేయనున్నారనే ప్రచారం జోరందుకుంది.

అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకూ అధికారక ప్రకటన వెలువడనప్పటికీ... సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ త్వరలో ముంబయి వెళ్లి అమితాబ్‌ బచ్చన్‌, రాజ్యసభ సభ్యురాలు జయా బచ్చన్‌ ను కలిసే అవకాశం ఉన్నట్లు కథనాలొస్తున్నాయి.

కాగా... అమితాబ్‌ 1984లో అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ కోరిక మేరకు ప్రయాగ్‌ రాజ్‌ లోక్‌ సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో అమితాబ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. సమీప లోక్‌ దళ్‌ అభ్యర్థి హేమవతి నందన్ బహుగుణపై లక్ష పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొందారు.

అవును... ఆ ఎన్నికల్లో అమితాబ్‌ కు 68శాతం ఓట్లు రాగా, బహుగుణకు 25 శాతం ఓట్లే పోలయ్యాయి. ఇక అభిషేక్‌ తల్లి జయా బచ్చన్‌ కూడా ప్రస్తుతం సమాజ్‌ వాదీ పార్టీ తరఫున యూపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్‌ ను కూడా ప్రయాగ్‌ రాజ్‌ నుంచి బరిలో దించాలని సమాజ్‌ వాదీ అగ్రనేతలు భావిస్తున్నారని అంటున్నారు.

ఒకవేళ నిజంగా అదే జరిగితే 1984లో జరిగిన సీన్ 2024లో రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా అనేది ఆసక్తికరంగా మారింది. అవును... 2024లో జరగనున్న లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ డాక్టర్‌ రీటా బహుగుణ జోషికి టికెట్ ఇస్తే 1984 నాటి సీన్ ప్రయాగ్‌ రాజ్‌ లో మరోసారి కనిపించనున్నదని అంటున్నారు.

కాగా... బీజేపీ సిట్టింగ్ ఎంపీ డాక్టర్‌ రీటా బహుగుణ జోషి.. త్రండి హేమవతి నందన్‌ బహుగుణ 1984లో లోక్‌ దళ్‌ నుంచి పోటీ చేస్తే... అమితాబ్‌ బచ్చన్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు 2024లో వారి వారసులు ఇద్దరూ తలబడితే రసవత్తర పోరు ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News