ఆ డైరెక్టర్ తో కరీనాకపూర్ కి గొడవ అయిందా?
బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ ఈ మధ్య మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోన్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ ఈ మధ్య మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోన్న సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలతో పాటు..ఇతరుల విషయాలు లీక్ చేసి సంచలనమవుతుంది. కెరీర్ ముగింపు దశలో ఉందని ఇలా గుట్టు విప్పుతుందో? లేక వాస్తవాలు తెలియాలని ఇలా లీక్ చేస్తుందో తెలియదు గానీ అమీషా వ్యాఖ్యలు మాత్రం నెట్టింట వాడి వేడి చర్చకు దారి తీస్తున్నాయి. తాజాగా కరీనా కపూర్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీక్ చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ `కహోనా ప్యార్ హై` సినిమాతో పరిచయమైన సంగతి తెలిసిందే. హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ తెరకెక్కించారు. ఇదే సినిమాతో అమీషా పటేల్ కూడా హీరోయిన్ గా లాంచ్ అయింది. అయితే ఇందులో మొదట గా హీరోయిన్ కరీనా కపూర్ ని తీసుకున్నారుట. ఆమెకి కథ చెప్పడం..నచ్చడం..అగ్రిమెంట్ చేసుకోవడం అన్నీ జరిగాయట. కరీనా ఈ కథలో ఎలాగైనా నటించాలని ఎంతో ఇష్టపడిందిట.
అయితే సరిగ్గా సినిమా ప్రారంభోత్సవ సమయంలో దర్శకుడు రాకేష్ రోషన్ తో కరీనా గొడవ పడిందిట. దీంతో సినిమా నుంచి ఉన్న పళంగా కరీనాని తొలించారని అమీషా తెలిపింది. అయినా కరీనా నటించాలని ఆశపడినా రాకేష్ ఒప్పుకోలేదుట. కరీనా వెళ్లిపోయిన తర్వాత దర్శకుడకి ఎవర్నీ తీసుకోవాలో అర్దం కాలేదుట. ఆ పాత్రకి కరీనా అయితే న్యాయం చేయగలదని భావించిన ఆయన ఆ తర్వాత చాలా కంగారు పడ్డారుట.
చివరికి అదే సమయంలో ఓ ఫంక్షన్ లో రాకేష్ రోషన్ అమీషా పటేల్ ని చూసారుట. కరీనా తర్వాత ఆ పాత్రకి అమీషా అయితే బాగుంటుందని భావించారుట. దీంతో అమీషాకి ఎలాంటి ట్రైనింగ్ కూడా లేకుండా అవకాశం కల్పించారుట. వీటిలో కొన్ని విషయాలు రాకేష్ రోషన్ భార్య అమీషా పటేల్ కి చెప్పినట్లు తెలిపింది. ఆ సినిమా సక్సెస్ తర్వాత నటిగా మంచి అవకాశాలు వచ్చాయని సంతోషం వ్యక్తం చేసింది. అయితే ఇంతకాలం దాచేసిన విషయాలు అమీషా ఇప్పుడు ఓపెన్ అవ్వడం వెనుక అసలు కారణ ఏంటి? అన్నది సస్పెన్స్.