ఆదికేశవ ఆగష్టులో వచ్చేది డౌటే?

ఆదికేశవ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదంట.

Update: 2023-07-21 04:10 GMT

మెగా హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జోడీగా నటించిన ఆదికేశవ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ చిత్రాన్ని ఆగష్టు లో రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. వైష్ణవ్ తేజ్ నుంచి రాబోతున్న పూర్తిస్థాయి యాక్షన్ మూవీ ఆదికేశవ. తనని తాను కమర్షియల్ హీరోగా ఎలివేట్ చేసుకోవడానికి ఈ సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. శ్రీలీల, వైష్ణవ్ తేజ్ మధ్య రొమాంటిక్ ఎలివేషన్ తో మాత్రమే ఈ గ్లింప్స్ ని ఆవిష్కరించారు. దాని తర్వాత కనీసం టీజర్ కూడా ఇప్పటి వరకు రాలేదు. కనీసం బజ్ కూడా లేదని చెప్పాలి. దీంతో ఈ చిత్రంపై టాలీవుడ్ సర్కిల్ లో ఇప్పుడు ఇంటరెస్టింగ్ టాక్ నడుస్తోంది. ఆదికేశవ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదంట.

ఈ నేపథ్యంలో ఆగష్టులో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని ప్రచారం నడుస్తోంది. సెప్టెంబర్ లో కాస్తా గ్యాప్ చూసుకొని మూవీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారంట. అయితే సెప్టెంబర్ నెలలో ప్రతి వారం ఒక పాన్ ఇండియా మూవీ రిలీజ్ కాబోతోంది. ఖుషితో మొదలు పెడితే సలార్ వరకు వారానికి ఒక్క సినిమా వస్తోంది. మరి ఈ పోటీలో ఆదికేశవ సినిమాని రిలీజ్ చేయడం రిస్క్ అనే మాట వినిపిస్తోంది.

అయితే పాన్ ఇండియా మూవీకి పోటీగా రిలీజ్ చేస్తే ఆ చిత్రం హౌస్ ఫుల్ అయిన, డివైడ్ టాక్ వచ్చిన నెక్స్ట్ ఛాయస్ గా ఆదికేశవ మూవీ చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిచూపించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారంట. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆగష్టు ఆఖరుకి కంప్లీట్ అవ్వనుందని టాక్ వినిపిస్తోంది.

పెళ్లి సందడి, ధమాకా తర్వాత శ్రీలీల నుంచి రాబోతున్న మూవీ ఆదికేశవ కావడం విశేషం. ఈ సినిమాపై వైష్ణవ్ తేజ్ తో పాటు శ్రీలీల కూడా చాలా హోప్స్ పెట్టుకుంది. ఉప్పెన తర్వాత వైష్ణవ్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఆదికేశవతో సాలిడ్ హిట్ ని ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారు.

Tags:    

Similar News