స్టార్ హీరోయిన్ గర్భిణి అంటూ ప్రచారం ఇంతలోనే
పరిణీతి- రాఘవ్ దంపతులు త్వరలో ప్రతిష్టాత్మక ఈవెంట్ కోసం లండన్ వెళ్లనున్నారు. దాని కోసం ప్రిపరేషన్‌లో బిజీగా ఉన్నారని కూడా పీఆర్ టీమ్ సభ్యులు ధృవీకరించారు.
ప్రముఖ స్టార్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఇటీవలే రాజకీయ కుటుంబం నుంచి యువనాయకుడిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పారి ఫ్రెగ్నెంట్ అంటూ ప్రచారం సాగుతోంది. ఇంతలోనే ఈ వార్తలను ఆ కుటుంబం ఖండించింది. వివరాల్లోకి వెళితే..
హిందీ చిత్రసీమలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న పరిణీతి చోప్రా.. ఆప్ మంత్రి, ప్రముఖ రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దాను గత ఏడాది ఢిల్లీలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం ఈ జంట అన్యోన్యతకు సంబంధించిన ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు పెళ్లయిన ఆర్నెళ్లకే పరిణీతి గర్భవతి అంటూ ప్రచారం సాగుతోంది.
పరిణీతి తన మొదటి బిడ్డను కనేందుకు రెడీ అవుతోందంటూ ముంబై ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఈ వార్త వైరల్ అయిన వెంటనే పరిణీతి బృందం వాటిని ఖండించింది. ఇవన్నీ ఫేక్ అని నివేదించింది. పరిణీతి- రాఘవ్ దంపతులు త్వరలో ప్రతిష్టాత్మక ఈవెంట్ కోసం లండన్ వెళ్లనున్నారు. దాని కోసం ప్రిపరేషన్‌లో బిజీగా ఉన్నారని కూడా పీఆర్ టీమ్ సభ్యులు ధృవీకరించారు.
యానిమల్ ఆఫర్ మిస్:
రణబీర్ కపూర్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన 'యానిమల్' సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా లో గీతాంజలి (రష్మిక పాత్ర) పాత్రను పోషించడానికి పరిణీతి చోప్రా మొదటి ఎంపిక. కానీ లుక్ టెస్ట్ చేసినప్పుడు పరిణీతి ఆ పాత్రకు సరిపోలేదని భావించి తొలగించినట్టు సందీప్ రెడ్డి తెలిపారు. దీంతో పరిణీతి చాలా బాధ పడింది. కానీ నేను ఎందుకు అలా చెబుతున్నానో ఆమెకు అర్థం చేసుకుందని కూడా వంగా తెలిపారు.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్'లో రణబీర్ కపూర్ నటనతో పాటు, రష్మిక పాత్రకు గొప్ప పేరొచ్చింది. బహుశా పరిణీతి ఒక మంచి అవకాశాన్ని కోల్పోయింది. కానీ సందీప్ వంగా తన సినిమాలో ఆఫర్ ఇస్తానని తనకు మాటిచ్చాడు గనుక ప్రభాస్ సరసన 'స్పిరిట్'లో నటించే అవకాశం కల్పిస్తారేమో చూడాలి.