'బ్రో'... ఆ అరగంట పిండేస్తారట
పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన బ్రో సినిమా లో మాస్ ఎలిమెంట్స్ కంటే కూడా కాస్త ఎక్కువగా ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయి అంటూ యూనిట్ సభ్యులు తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.
పవన్ కళ్యాణ్ సినిమా అనగానే చాలా మంది మాస్ మసాలా సినిమా అంటూ ఊహించుకుంటూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన బ్రో సినిమా లో మాస్ ఎలిమెంట్స్ కంటే కూడా కాస్త ఎక్కువగా ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయి అంటూ యూనిట్ సభ్యులు తాజాగా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం జరిగింది.
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ముగించుకుని సెన్సార్ కార్యక్రమాలను ముగించుకున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పలువురు ఇండస్ట్రీకి చెందిన వారు 'బ్రో' సినిమాను చూశారట. వారు వినోదయ్య సితం కి ఈ సినిమాకు అసలు సంబంధం లేనట్లుగా ఉందని... కేవలం స్టోరీ లైన్ తీసుకుని మొత్తం స్క్రిప్ట్ ను... స్క్రీన్ ప్లే ను మార్చినట్లుగా చెబుతున్నారు.
సినిమాలో పవన్ కళ్యాణ్ ను దేవుడిగా చూపించారట. పవన్ కళ్యాణ్ సన్నివేశాల కోసం త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ద పెట్టి స్క్రీన్ ప్లే డైలాగ్స్ ను రాశారు అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఈ సినిమాలోని చివరి 20 నిమిషాలు గుండెలను పిండేసేంత ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయట. ఈ విషయాన్ని పలువురు చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కనిపించేది ఎంత సమయం అనేది అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎంత సమయం కనిపించినా కూడా పవన్ సినిమాగానే బ్రో ను ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవల విడుదల అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమా కి మరింతగా ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది.
ఈ సినిమా లో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా కేతిక శర్మ నటించగా కీలక పాత్రలో వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది. ఒరిజినల్ వర్షన్ కి దర్శకత్వం వహించిన సముద్ర ఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది.