'గుంటూరు కారం' కథ చేతులు మారిందా?

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం గుంటూరు కారం

Update: 2023-07-27 08:30 GMT

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'గుంటూరు కారం'. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా లో హీరోయిన్స్ గా శ్రీ లీల, మీనాక్షి చౌదరి లు నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ విడుదలైంది... గ్లిమ్స్ ను కూడా విడుదల చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కథ ఏంటి అనేది మాత్రం రివీల్ కాలేదు.

ఈ సినిమా స్టోరీ లైన్ ఏమై ఉంటుంది... ఎందుకు గుంటూరు కారం అనే టైటిల్ ను పెట్టి ఉంటారు అంటూ చాలా మంది చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో ఇండస్ట్రీ వర్గాల్లో, మీడియా సర్కిల్స్ లో కథ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. అల వైకుంఠపురంలో సినిమా సమయంలోనే త్రివిక్రమ్‌ ఈ స్టోరీ లైన్‌ ను రెడీ చేయడం జరిగిందట.

ఈ స్టోరీ లైన్ ను ఎన్టీఆర్‌ కు చెప్పడం ఆయన ఓకే చెప్పడం జరిగిందట. ఎన్టీఆర్‌ ఆ సమయంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చేస్తూ ఉన్న కారణంగా ఆ సినిమా తర్వాత త్రివిక్రమ్‌ తో సినిమా అనుకున్నాడు.. అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. కథ చేతులు మారి మహేష్ బాబు వద్దకు చేరిందట.

ఎన్టీఆర్‌ కు కూడా కథ నచ్చినప్పటికి కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్‌ చేతులు మారింది. అయితే ఇప్పుడు గుంటూరు కారం సినిమా మహేష్ బాబు కు కెరీర్‌ బిగ్గెస్ట్‌ సక్సెస్‌ ను ఇవ్వబోతున్న నేపథ్యం లో ఎన్టీఆర్‌ చేసి ఉంటే బాగుండేది అన్నట్లుగా కొందరు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు కూడా కమర్షియల్‌ గా డిజాస్టర్స్‌. ముఖ్యంగా ఖలేజా సినిమా మహేష్ కెరీర్‌ లోనే అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది అనడంలో సందేహం లేదు. అలాంటి కాంబోలో రాబోతున్న సినిమా అయినప్పటికి కూడా గుంటూరు కారం కు మంచి బజ్‌ క్రియేట్‌ అయింది.

పదేళ్లుగా మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబో మూవీ కోసం ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక మంచి కథతో రావడం అవసరం అని భావించిన త్రివిక్రమ్‌ ఈ స్టోరీనే మహేష్ బాబు వద్దకు తీసుకెళ్లి ఉంటాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కథలు చేతులు మారడం ఇండస్ట్రీలో చాలా కామన్‌ విషయం. ఇంతకు ఈ కథ ఎన్టీఆర్ వద్దకు వెళ్లిందా లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News