క‌ళ్యాణ్ రామ్ 'డెవిల్' స్టోరీ ఇదే!

తాజాగా సినిమా స్టోరీ లైన్ లీకైంది.స్వాతంత్య్రానికి పూర్వం మ‌ద్రాస్ ప్రెసిడెన్సీ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది.

Update: 2023-07-22 07:59 GMT

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ కంటెంట్ ప‌రంగా రూట్ మార్చేసి కొత్త స్టైల్లో వెళ్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇన్నోవేటివ్ సినిమాలు చేస్తూ త‌న ఐడెంటిటీనే మార్చేస్తున్నాడు. ఈ ర‌క‌మైన జ‌ర్నీ క‌ళ్యాన్ రామ్ కెరీర్ ని ఎంతో ముందుకు తీసుకెళ్లింది. ఆయ‌న‌లో ఇప్పుడు అభిమానులు కొత్త న‌టుడ్ని చూస్తున్నారు. కొన్ని ప్ర‌య‌త్నాలు సానుకూలంగా లేక‌పోయినా! ఐడెంటిటీ మాత్రం ప్ర‌త్యేకంగానే హైలైట్ అవుతుంది.

ప్ర‌స్తుతం న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో 'డెవిల్' అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో క‌ళ్యాణ్ రామ్ స్పై పాత్ర‌లో పోషిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే లీకైంది. అయితే ఆరోల్ ఎలా ఉంటుంది? సినిమా నేప‌థ్య ఏంటి? ఎలాంటి క‌థ‌ని ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిస్తున్నారు? వంటి విష‌యాలు ఇన్నాళ్లు గోప్యంగా ఉన్నాయి. తాజాగా సినిమా స్టోరీ లైన్ లీకైంది.స్వాతంత్య్రానికి పూర్వం మ‌ద్రాస్ ప్రెసిడెన్సీ నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. అప్ప‌టి గూఢ‌చారి వ్య‌వ‌స్థ ఎలా ఉండేది.

ప్ర‌భుత్వాల ప‌నితీరు ఎలా ఉండేది? వంటి అంశాల్ని ఆధారంగా చేసుకుని సినిమా తెర‌కెక్కిస్తున్నారుట‌. ఈ క‌థ పూర్తిగా వాస్త‌వాల‌కు చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని..కొన్ని వాస్త‌వం స‌ఘ‌ట‌న‌ల్ని ఆధారంగా చేసుకుని త‌యారు చేసిన క‌థ‌గా స‌మాచారం.

ఇందులో క‌ళ్యాణ్ రామ్ బ్రిటీష్ ఏజెంట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఓర‌హ‌స్యాన్ని చేధించే క్ర‌మంలో ఆయ‌న చేసే సాహ‌సాలు..పోరాట ఘ‌ట్టాలు ఆస‌క్తిరేకెత్తించేలా ఉంటాయ‌ని యూనిట్ వ‌ర్గాలు అంటున్నాయి.

సినిమా ప్రారంభం నుంచి ముగింపు వ‌ర‌కూ క‌థ‌నం ప‌రుగులు పెట్టించేలా ఉంటుందిట‌. ప్రేక్ష‌కుడ్ని ఆద్యంత మెప్పిస్తూ..సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంద‌ని..అంత ఇంటెన్స్ స్టోరీతో సినిమా ఉంటుంద‌ని యూనిట్ వ‌ర్గాల నుంచి లీకులందుతున్నాయి. స్పై సినిమాల్లో ఇదొక డిఫరెంట్ సినిమా అవుతుంద‌ని చెబుతున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ రామోజీ ఫిలిం సిటీలో ప్ర‌త్యేకంగా నిర్మించిన సెట్ లో చిత్రీక‌రిస్తున్నారు. క‌ల్యాన్ రామ్ ఇత‌ర తారాగాణంపై కీల‌క‌మైనా యాక్ష‌న్ స‌న్నివేశాలు షూట్ చేస్తున్నారు. ఈనెల‌ఖ‌రు వ‌ర‌కూ వాటినే చిత్రీక‌రించ‌నున్నారు. ఈ ఫైట్ సీన్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంద‌ని..గుమ్మ‌డికాయ కొట్టే సి ముగింపు ప‌లికేస్తార‌ని స‌మాచారం.

Tags:    

Similar News