మెగా ప్రాజెక్ట్.. అంతా సెట్టయినట్లే..

మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తె సుస్మిత నిర్మాణంలో ఒక మూవీ చేయడానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే.

Update: 2023-09-03 04:28 GMT

మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తె సుస్మిత నిర్మాణంలో ఒక మూవీ చేయడానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని ఆమె ప్లాన్ చేస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందని, వీలైనంత వేగంగా స్టార్ట్ చేయడంతో పాటు ఫినిష్ కూడా చేసేసి సంక్రాంతికి రిలీజ్ చేయడానికి వర్క్ అవుట్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది.

అయితే ఏమైందో ఏమో కనీసం మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే రోజు కూడా ఆ సినిమాకి సంబందించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో సినిమాని మాత్రం కాన్సెప్ట్ పోస్టర్ తో ఎనౌన్స్ చేశారు. ఇక కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ ని ఆ రోజు ప్రకటించకపోవడానికి కారణం రీమేక్ స్టోరీ అని తెలుస్తోంది. నిజానికి బ్రో డాడీ రీమేక్ గా ఆ సినిమా చేయాలని అనుకున్నారంట.

అయితే భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ ఆలోచన మార్చుకున్నారని తెలుస్తోంది. రీమేక్ కథల జోలికి వెళ్లకూడదని డిసైడ్ కావడంతో కొత్త కథపై వర్క్అవుట్ చేశారంట. కళ్యాణ్ కృష్ణ కూడా ఆప్సనల్ గా మరో స్ట్రైట్ స్టోరీని సిద్ధం చేశారంట. ప్రసన్నకుమార్ బెజవాడ దీనికి కథ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఫైనల్ గా చిరంజీవి వారు ఇచ్చిన నేరేషన్ కి ఒకే చెప్పారంట.

బ్రోడాడీ రీమేక్ పక్కన పెట్టి కొత్త కథతోనే మూవీ చేయడానికి ముందుకి వెళ్తున్నారంట. త్వరలో ఈ చిత్రానికి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల మాట. ఎంటర్టైన్మెంట్ జోనర్ లో చేసే సినిమా కావడంతో వీలైనంత వేగంగా ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. మొత్తానికి కూతురు కోసం మెగాస్టార్ చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

గాడ్ ఫాదర్, భోళా శంకర్ డిజాస్టర్స్ తర్వాత రీమేక్ కథల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం అనే నిర్ణయానికి చిరంజీవి వచ్చేసినట్లు వినిపిస్తోంది. ఇకపై రజినీకాంత్, కమల్ హాసన్ ని ఫాలో అవుతూ డిఫరెంట్ కథలని ఎంపికచేసుకొని ప్రేక్షకులని థ్రిల్ చేసే ఛాన్స్ లు ఉన్నాయంట. అందులో భాగంగానే మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు.

Tags:    

Similar News