పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి తేజ్ కలిసి నటించిన బ్రో మూవీ మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతుంది. తమిళ సినిమా వినోదయ సీతం కి తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో కెతిక శర్మ, ప్రియ ప్రకాశ్ వారియర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పవన్ బ్రో సినిమా విషయంలో మేకర్స్ ప్లాన్ పర్ఫెక్ట్ గా ఉంది. సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనుకున్న బడ్జెట్ లోనే పూర్తి చేశారని తెలుస్తుంది. అందుకే సినిమాకు టికెట్లు పెంచడం కానీ, నైట్ షోలు వేయడం కానీ చేయట్లేదట.
బ్రో సినిమా విషయంలో ఫ్యాన్స్ ఎందుకో కాస్త నిరాశగా ఉన్నారు. వాళ్లలో ఉత్సాహం నింపేందుకు మేకర్స్ ట్రైలర్ రిలీజ్ ఏర్పాటు చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ అయ్యాక అయినా బ్రో మీద బజ్ ఏర్పడుతుందేమో చూడాలి. పవన్ సినిమా అంటే ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. బ్రో సినిమాకు కూడా అలాంటి భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఈ సినిమాకు మూల కథ సముద్ర ఖనిదే అయినా సినిమాను తెలుగు ఆడియన్స్ కు మెచ్చేలా పవన్ పాత్రకు కొంత ఎలివేషన్స్ ఇచ్చి త్రివిక్రం తన పెన్ పవర్ చాటుకున్నాడని తెలుస్తుంది. మేకర్స్ చెప్పే మాటలను బట్టి చూస్తే ఈ సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ అందిస్తుందని అంటున్నారు. అదే నిజం అయితే మాత్రం పవన్ బ్రో రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్ సాయి తేజ్ ఇద్దరితో వచ్చే సీన్స్ మెగా ఫ్యాన్స్ అందరినీ అలరిస్తాయని తెలుస్తుంది. ఈమధ్య కాలంలో పవన్ అతి తక్కువ టైం లో పర్ఫెక్ట్ షెడ్యూల్ లో పూర్తి చేసిన సినిమా ఇదే అని చెప్పొచ్చు.
పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపిస్తున్న బ్రో సినిమా లో డైలాగ్స్ అదిరిపోయేలా ఉంటాయని అంటున్నారు. త్రివిక్రం ఈ సినిమాలో డైలాగ్స్ కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారని తెలుస్తుంది.
విరూపాక్ష హిట్ తో కం బ్యాక్ వచ్చిన సాయి తేజ్ బ్రోతో మరో హిట్ టార్గెట్ పెట్టుకున్నాడు. బ్రోకి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాకు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్రాధాన్యత వహించేలా ఉంటుందని అంటున్నారు. బ్రో తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను కూడా ఈ ఇయర్ ఎండింగ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.