బుచ్చిబాబు - చరణ్.. రిలీజ్ ఎప్పుడంటే..
ఇక మొత్తానికి బుచ్చిబాబు అయితే అనుకున్న కథను పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ తో సహా రెడీ చేసుకున్నాడు. దాదాపు షూటింగ్ కు సంబంధించిన ప్లానింగ్ కూడా రెడీ అయింది. ప్రస్తుతం నటీనటులను ఫైనల్ చేసే పనిలో దర్శకుడు బిజీగా ఉన్నాడు.
ఉప్పెన సినిమాతో 100 కోట్ల మార్కెట్ ను సంపాదించిన దర్శకుడు బుచ్చిబాబు ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నుంచే చాలా రకాల ఆఫర్స్ అందుకున్నాడు. అతను అనుకుంటే మరొక రెండు సినిమాలు ఈపాటికి పూర్తిచేజ్ చాన్స్ అయితే ఉండేది. కానీ ఆ లా కాకుండా బుచ్చిబాబు నెక్స్ట్ సినిమాను అగ్ర హీరో తోనే చేయాలని చాలా బలంగా ఫిక్స్ అయ్యాడు.
జూనియర్ ఎన్టీఆర్ తో చాలా రోజులపాటు చర్చలు జరిపాడు. కానీ ఆ కథ ఫిక్స్ కాలేదు. ఇక మొత్తానికి రామ్ చరణ్ తోనే మరోసారి చర్చలు జరిపి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడు. ఇక కథ బాగా నచ్చడంతో రామ్ చరణ్ తేజ్ కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా వీలైనంత త్వరగా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలి అని అనుకున్నాడు. RC 16 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా పనులను కొనసాగించనున్నారు.
కానీ మధ్యలో గేమ్ చెంజర్ సినిమా కారణంగా రామ్ చరణ్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఎందుకంటే బుచ్చిబాబు సెట్ చేసుకున్న కథ ప్రకారం సరికొత్త బాడీ లాంగ్వేజ్ తో పాటు గెటప్ కూడా మార్చాల్సి ఉందట. కాబట్టి హెయిర్ స్టైల్ తో పాటు ఫిట్నెస్ విషయంలో కూడా మార్పులు చేయడం కోసం మరికొంత సమయం అయితే తీసుకున్నారు.
ఇక మొత్తానికి బుచ్చిబాబు అయితే అనుకున్న కథను పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ తో సహా రెడీ చేసుకున్నాడు. దాదాపు షూటింగ్ కు సంబంధించిన ప్లానింగ్ కూడా రెడీ అయింది. ప్రస్తుతం నటీనటులను ఫైనల్ చేసే పనిలో దర్శకుడు బిజీగా ఉన్నాడు. ఇక రెండు నెలలపాటు సినిమాపై వర్క్ షాప్ కూడా నిర్వహించాలి అని దర్శకుడు ఫిక్స్ అయ్యాడు.
అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈ ఏడాది డిసెంబర్లో మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఆలోపు రామ్ చరణ్ తేజ్ గేమ్ చెంజర్ సినిమా పనులన్నీ కూడా ఫినిష్ చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు. ఇక RC 16 సినిమా షూటింగ్ కోసమే దాదాపు ఏడాది పాటు సమయం పట్టే అవకాశం ఉంది. ఇక సినిమా విడుదల అనేది వచ్చే ఏడాది ఉండకపోవచ్చు. 2025 లోనే RC16 ని థియేటర్లలోకి తీసుకువచ్చే అవకాశం అయితే ఉంది. ఇక విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా కథ ఉండబోతోంది. సీనియర్ నటి లయ ఒక ముఖ్యమైన పాత్రలో నటించనుందని సమాచారం.