ఆర్ సీ 16 కూడా తీరప్రాంతం స్టోరీనా?
ఆర్ 16వ చిత్రం `ఉప్పెన` ఫేం బుచ్చిబాబు తో లాక్ అయిన సంగతి తెలిసిందే. `గేమ్ ఛేంజర్` పూర్తవ్వ గానే చరణ్ షూటింగ్ షురూ చేస్తాడు.
# ఆర్ 16వ చిత్రం `ఉప్పెన` ఫేం బుచ్చిబాబు తో లాక్ అయిన సంగతి తెలిసిందే. `గేమ్ ఛేంజర్` పూర్తవ్వ గానే చరణ్ షూటింగ్ షురూ చేస్తాడు. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో దర్శకుడు బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈసినిమా ఎలా ఉండబోతుందో? బుచ్చిబు రివీల్ చేసిన సంగతి తెలిసిందే. రా అండ్ రస్టిక్ ఫిల్మ్ అని క్లియర్ గాచెప్పేసాడు. అంటే చరణ్ పాత్ర కూడా చాలా మాసివ్ గా ఉంటుందని తేలిపోయింది. అయితే స్టోరీ నేపథ్యం ఏంటి? అన్నది రివీల్ చేయలేదు.
దీంతో తాజాగా ఇది కూడా తీరప్రాంతం నేపథ్యంలో సాగే స్టోరీ అని లీకైంది. బుచ్చి బాబు `ఉప్పెన` తరహాలోనే కంటెంట్ ని సిద్దం చేసినట్లు చెబుతున్నారు. ఇందులో హీరో పాత్రకి చదువుండదుట. ఓ కుగ్రామంలో మొదలైన కథ ఓ మెట్రో సిటీలో ముగింపు పడుతుందిట. ఈ కథకి రెండవ భాగం కూడా తీసే అవకాశం ఉంటుందిట. అయితే ఈ కథ పూర్తిగా తెలుగు ప్రేక్షకుల సినిమా మాత్రమే అవుతుందని..పాన్ ఇండియాకి కనెక్ట్ అవుతుందా? లేదా? అన్న దానిపై క్లారిటీ లేదు.
ఏది ఏమైనా బుచ్చి బాబు మరోసారి హిట్ నేపథ్యాన్నే తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తీర ప్రాంత కథలు టాలీవుడ్ లో ట్రెండింగ్ మారిని సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటిస్తోన్న `దేవర` కూడా మత్సకార నేపథ్యంలోనే సాగుతుంది. అలాగే నాగచైతన్య-చందు మొండేటి కథ కూడా మత్సకారులకు సంబంధిం చిందే. ఈ నేపథ్యంలో ఆర్ సీ 16 కూడా తీర ప్రాంత కథ అంటూ తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.
మరి ఇందులో నిజమెంతో యూనిట్ ధృవీకరించాల్సి ఉంది. బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు. `ఉప్పెన` సహా అతని రైటింగ్ స్టైల్ నచ్చి పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ నమ్మి అవకాశం ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే చరణ్ పై తన అభిమానమంతా సినిమాలో చూపిస్తానని ప్రామిస్ చేసాడు. మెగా అభిమానులు ఆయన్ని బలంగా నమ్ముతున్నారు. మరి ఈ నమ్మకం ఎంత బలంగా నిలబడుతుందో చూడాలి.