'డబుల్ ఇస్మార్ట్​'.. మ్యూజిక్​ రెమ్యునరేషన్​లో తేడాలు

సంగీతమే ఆయన సామ్రాజ్యం. స్వరాలే ఆయన అస్త్రాలు. ఆయన మ్యూజిక్​ అందించిన సినిమాలు సూపర్​హిట్​గా నిలిచాయి కలెక్షన్లను కురిపించాయి.

Update: 2023-07-30 05:49 GMT

సంగీతమే ఆయన సామ్రాజ్యం. స్వరాలే ఆయన అస్త్రాలు. ఆయన మ్యూజిక్​ అందించిన సినిమాలు సూపర్​హిట్​గా నిలిచాయి కలెక్షన్లను కురిపించాయి. బ్లాక్‌బాస్టర్‌ హిట్స్‌తో స్టార్‌ మ్యూజిక్‌ డైరక్టర్​గా ఎదిగిన ఆయన.. ప్రేక్షకుల హృదయాల్లో మెలోడీ బ్రహ్మ మణిశర్మగా చెరగని ముద్దవేసుకున్నారు. అయితే ఆ మధ్యలో ఆయన కెరీర్​లో డౌన్ స్టేజ్​కు వెళ్లిపోయారు.

అటువంటి సమయంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ఇచ్చిన ఛాన్స్​తో 'ఇస్మార్ట్​ శంకర్'​ అంటూ మళ్లీ బౌన్స్​ బ్యాక్​ అయ్యారు మణిశర్మ. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్​ బిజీగా ఉంటున్నారు. అయితే ఇదే సమయంలో పూరి.. రీసెంట్​గా 'ఇస్మార్ట్​ శంకర్'​కు సీక్వెల్​గా 'డబుల్ ఇస్మార్ట్'​ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి మణిశర్మ పేరు మాత్రం ఖరారు చేయలేదు. మ్యూజిక్​ డైరెక్టర్​గా ఎవరిని పెట్టాలో అని చర్చలు సాగుతున్నాయట.

ఈ క్రమంలోనే ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. వాస్తవానికి ఇప్పటికే పూరిజగన్నాథ్​... తాను లైఫ్​ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్​కే అవకాశం ఇచ్చారట. అయితే ఆయన రెమ్యునరేషన్​గా రూ.2కోట్లు డిమాండ్​ చేశారట. కానీ డబుల్ ఇస్మార్ట్​ నిర్మాతలు మాత్రం అంత ఇవ్వలేనని ఆయన్ను పక్కనపెట్టారట.

దీంతో సదరు మ్యూజిక్​ డైరెక్టర్​ చాలా ఫీలైయ్యారట. తనకు వర్త్​ ఆ మాత్రం లేదా అంటూ తన స్నేహితులతో చెప్పుకుని బాధపడ్డారట. ఈ విషయం ఇన్​సైడ్​ టాక్​ వల్ల తెలిసింది. అలాగే డబుల్​ ఇస్మార్ట్​ నిర్మాతలు కూడా తాము లైఫ్​ ఇచ్చిన డైరెక్టర్​ తమ దగ్గరే ఎక్కవ మొత్తం అడిగితే ఎలా అని భావిస్తున్నారట.

ఇంకా మరో ఇద్దరు ముగ్గురు టాప్ సంగీత దర్శకులు దగ్గరకు కూడా వాళ్లు వెళ్లగా.. ఏకంగా రూ.5 నుంచి 6 కోట్ల వరకు డిమాండ్ చేశారట. దీంతో మళ్లీ తాము లైఫ్ ఇచ్చిన సంగీత దర్శకుడికి దగ్గరికి వెళ్లలేక.. తాము అనుకున్న రేటుకు అందుబాటులో ఎవరున్నారా? అలానే వారికి స్టార్ డమ్​ కూడా ఉండేలా పలువురు పేర్లు పరిశీలిస్తున్నారట. చూడాలి మరి ఎవరు ఫైనలైజ్ అవుతారో..

Similar News