బాబుతో మూడుగంటలు : పీకే విభీషణుడా....!?
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీ రాజకీయంగా సంచలనం రేకెత్తించింది.
ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే రాజకీయ టీడీపీ అధినేత చంద్రబాబుతో దాదాపుగా మూడు గంటల పాటు భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీ రాజకీయంగా సంచలనం రేకెత్తించింది. పీకే అంటే జగన్ అన్నట్లుగా సౌండ్ వస్తుంది. ఏపీ పొలిటికల్ తెర పైన పీకే మెరిసింది జగన్ తో జట్టుగా.
ఇక పీకే టీం గా చెప్పుకునే ఐ ప్యాక్ టీం ఏపీలో సేవలు అందిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా జగన్ పీకేల బంధానికి ఆరేళ్ళు అని అంటున్నారు. జగన్ ఒక లీడర్ గా ఎన్నికల వ్యూహకర్త పీకేకు బాగా తెలుసు. జగన్ లీడర్ షిప్ క్వాలిటీస్ తో పాటు ఆయన బలహీనతలూ తెలుసు అని అంటున్నారు.
అదే విధంగా వైసీపీ పార్టీ బలం బలహీనత కూడా తెలుసు అని అంటున్నారు. ఇదే ఇపుడు చంద్రబాబుకు అర్జంటుగా కావాల్సి వచ్చింది అని అంటున్నారు. వైసీపీలో ఏమి జరిగింది ఏమి జరుగుతోంది అన్నది పూర్తి స్థాయిలో పీకే బాబుకు చెప్పారని అంటున్నారు. ఒక విధంగా వైసీపీ పొలిటికల్ రిపోర్ట్ ని పోస్ట్ మార్టం చేసి మరీ చంద్రబాబుకు ప్రశాంత్ కిశోర్ సమర్పించారు అని అంటున్నారు.
దీని వల్ల చంద్రబాబుకు రాజకీయ లాభం ఏమేరకు ఉంటుంది అన్నది పక్కన పెడితే లంక గుట్టు విభీషణుడు శత్రు శిబిరానికి చేరవేసిన తరహాలలో పీకే టీడీపీకి వైసీపీ లో గుట్టు చెప్పారని అంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో పై ఎత్తులకు టీడీపీకి ఒక చాన్స్ ఇచ్చారని అంటున్నారు.
పీకే రిపోర్ట్ ప్రకారం చూస్తే యువత వైసీపీ మీద అసంతృప్తిగా ఉందని చెప్పారని అలాగే అధిక ధరలు, అధిక విద్యుత్ చార్జీలు, నిరుద్యోగం తదితర అంశాలు ఏపీలో టార్గెట్ అంశాలు అని పీకే వివరిచారు అని అంటున్నారు. వీటిని ఆధారం చేసుకుని వచ్చే ఎన్నికల్లో టీడీపీ యాక్షన్ ప్లాన్ ఉండాలని పీకే చెప్పారని అంటున్నారు.
ఇక ప్రభుత్వంగా వైసీపీ బలాలను కూడా ప్రస్తావించారని అంటున్నారు. అలాగే జగన్ లీడర్ షిప్ మీద ఆయన నాయకత్వం పటిమ మీద కూడా పీకే మార్క్ విశ్లేషణ ముందుంచారని అంటున్నారు. ఇలా అన్నీ చెప్పి టీడీపీ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ డిజైన్ చేసుకోవాలని సూచించారని అంటున్నారు.
ఇవన్నీ చూస్తూంటే పీకే వైసీపీ గుట్టు చెప్పే విభీషణుడిగా మారారా అని సెటైర్లు పడుతున్నారు. నెటిజన్లు అయితే ఏపీ గురించి పీకేకి ఉన్న అవగాహన ఏంటి అని కూడా ప్రశ్నిస్తున్నారు. పీకే సక్సెస్ లే కాదు ఫెయిల్యూర్ స్టోరీస్ ఉన్నాయని అంటున్నారు. అదే విధంగా పొలిటికల్ గా చూస్తే ఎప్పటికపుడు రాజకీయాలు మారిపోతాయని అంటున్నారు.
పీకే గత కొన్నేళ్ళుగా ఏపీకి దూరంగా ఉంటున్నారని వైసీపీకి దూరంగా ఉంటున్నారని గుర్తు చేస్తున్నారు. అలాంటి పీకే తెలంగాణా ఎన్నికల ఫలితాలు అక్కడ ప్రజల ఆలోచనలను మిక్స్ చేసి ఏపీకి వాటిని అప్లై చేస్తున్నారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
ఇవన్నీ పక్కన పెడితే పీకేకు ఒక టీం అన్నది లేదు, ఆయన ఏమి దిశా నిర్దేశం చేసినా కూడా ఎంతవరకూ అమలు చేస్తారు అన్నది కూడా చూడాలని అంటున్నారు. మొత్తానికి పీకే జగన్ నుంచి బాబు సైడ్ తీసుకోవడం పట్ల నెట్టింట సెటైర్లు కామెంట్స్ పెద్ద ఎత్తున పడుతున్నాయి. ఈ పొలిటికల్ స్ట్రాటజిస్టులు అవసరమా అన్న నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.