ఆ యువ హీరోయిన్ కి సీనియర్ ప్రొడ్యూసర్ ఆంక్షలు!
చిన్న సినిమా గా రిలీజ్ అయి పెద్ద విజయం సాధించడంమే టాలీవుడ్ లో అవకాశాలు తెచ్చిపెడుతుంది.
ఆ యువ హీరోయిన్ కి సీనియర్ నిర్మాత ఆంక్షలు విధించాడా? అంచేత ఆ భామ అడ్డంగా బుక్కైందా? వచ్చిన ఆఫర్లన్నీ వదులుకోవాల్సి వస్తోందా? ఇప్పుడా భామ అనవసరంగా కమిట్ అయ్యానని ఫీలవుతోందా? అంటే అవుననే లీకులందుతున్నాయి. టాలీవుడ్ కి ఆ యువ నాయిక ఉవ్వెత్తున దూసుకొచ్చింది. ఒక్క సినిమాతోనే అమ్మడు తెలుగింట మంచి పాపులారిటీ దక్కించుకుంది. అందం.. అభినయమే కాదు అంతకు మించి మంచి నటి అని తొలి సినిమాతోనే ప్రూవ్ చేసింది.
చిన్న సినిమా గా రిలీజ్ అయి పెద్ద విజయం సాధించడంమే టాలీవుడ్ లో అవకాశాలు తెచ్చిపెడుతుంది. అలా వచ్చిన మొట్ట మొదటి అవకాశాన్ని ఓ నిర్మాత అడ్వాంటేజ్ గా తీసుకున్నట్లు వినిపిస్తుంది. ఆ నిర్మాత బ్యానర్లో యువ నాయిక రెండు సినిమాలకు కమిట్ అయింది. కానీ ఇప్పుడు వాటి నుంచి బయటకు రాలేక బాధపడుతోందిట. అందుకు కారణం ఆ నిర్మాత పెట్టిన కండీషన్లే అని వినిపిస్తోంది. ఆ రెండు సినిమాలు పూర్తి చేసే వరకూ బయట బ్యానర్లు వేటిలోనూ పనిచేయకూడదని టెర్మ్స్ అండ్ కండీషన్స్ లో ఉంది.
అప్పుడు కొత్త సహా అప్పుడే వచ్చిన నేపథ్యంలో పెద్ద బ్యానర్లో అవకాశం ఎందుకు వదులు కోవడం అని అమ్మడు కండీషన్స్ ని లైట్ తీసుకుని సైన్ చేసిందిట. కానీ ఇప్పుడా రెండు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుందిట. ఓ సినిమా సెట్స్ లో ఉంది. ఇంకోటి కొత్తగా లాంచ్ అయింది. సెట్స్ లో ఉన్న సినిమా ఏడాది నుంచి అక్కడే మూలుగుతోంది. అసలు ఆ సినిమా విషయం లో ఏం జరుగుతుందో కూడా తెలియలేదు.
డబ్జెట్ లేక ఆగిపోయిందా? అంటే అది కారణం కానే కాదు. ఎందుకంటే అందులో నటించే హీరో..నిర్మాత కూడా అంతా సీనియర్లే. బడ్జెట్ అనే క్వశ్చనే లేదు. కానీ ఆ సినిమా ఇంకా సెట్స్ లో నే ఉంది. మరో సినిమా పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుంది. ఇలాంటి పరిణామాల్లో ఆ యువ నాయిక అడ్డంగా బుక్కైంది. ఇప్పుడు వాటి నుంచి బయటకు రాలేదు..కొత్త సినిమాలకు అగ్రిమెంట్ చేసుకోలేక వచ్చిన ఆఫర్లన్నీ వదులుకోవాల్సి వస్తోందని స్నేహితుల వద్ద వాపోతుందిట.