క్యాన్సర్‌ బారిన కింగ్‌!

తాజాగా ఇంగ్లండ్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ – 3 క్యాన్సర్‌ బారినపడ్డారు.

Update: 2024-02-06 08:53 GMT

క్యాన్సర్‌.. అందరినీ వణికిస్తోంది. చిన్నాపెద్ద తేడా లేకుండా, ధనిక, బీద అనే తారతమ్యం లేకుండా సోకుతోంది. తాజాగా ఇంగ్లండ్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ – 3 క్యాన్సర్‌ బారినపడ్డారు. ఈ విషయాన్ని అధికారికంగా ఆయన నివాసం ఉంటే బకింగ్‌ హ్యామ్‌ ప్యాలెస్‌ వర్గాలు వెల్లడించాయి. జనవరిలో అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లగా ఆయన క్యాన్సర్‌ బారినపడ్డట్టు నిర్ధారణ అయ్యింది.

అయితే కింగ్‌ చార్లెస్‌–3కి వచ్చిందని ఏ రకమైన క్యాన్సరో బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ వెల్లడించలేదు. ఆయనకు తాజాగా క్యాన్సర్‌ కు చికిత్స మొదలైందని తెలిపింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజులపాటు ఆయన ప్రజా విధుల నుంచి తప్పుకుంటారని పేర్కొంది.

75 ఏళ్ల కింగ్‌ చార్లెస్‌ –3 తన జీవిత కాలంలో రెండుసార్లు కరోనా బారినపడటంతోపాటు ఒకటి రెండు ప్రమాదాల్లో గాయాలపాలయ్యారు. ఇవి మినహా ఇప్పటివరకు ఆయన ఆరోగ్య జీవితాన్నే గడుపుతూ వచ్చారు. ఇప్పుడు వృద్ధాప్య సమస్యలు ఏమీ లేకుండానే ఉన్నట్టుండి క్యాన్సర్‌ బారినపడ్డారు.

క్వీన్‌ ఎలిజిబెత్‌ కన్నుమూశాక కింగ్‌ చార్లెస్‌ –3 బ్రిటన్‌ చక్రవర్తిగా 2022లో సింహాసనాన్ని అధిరోహించారు. పైగా అత్యంత పెద్ద వయసులో బ్రిటిష్‌ రాజుగా పట్టాభిషేకం పొందిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

కాగా కింగ్‌ చార్లెస్‌–3ది ఆరోగ్యకరమైన జీవనశైలిని అని చెబుతున్నారు. ఆరోగ్యానికి ఆయన చాలా ప్రాముఖ్యత ఇస్తారని తెలుస్తోంది. సమతుల్య ఆహారం తీసుకోవడం, రోజూ యోగా చేయడం, వ్యాయామం తప్పకుండా చేస్తారు. ఇంతగా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకునే కింగ్‌ కేన్సర్‌ మహమ్మారిన బారిన పడటం అందరినీ షాక్‌ కు గురిచేసింది.

కింగ్‌ చార్లెస్‌–3 రోజుకు రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకుంటారు. ఉదయం అల్పాహారం, రాత్రికి భోజనం మాత్రమే. వారంలో రెండు రోజులు పూర్తిగా శాఖాహారమే తింటారు. పాల ఉత్పత్తులు అయిన పెరుగు, వెన్న, నెయ్యి తదితరాలకు ఆయన దూరంగా ఉంటారు. స్వయంగా ఈ విషయాన్ని తన 70వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా 2018లో కింగ్‌ చార్లెస్‌ వెల్లడించారు.

కింగ్‌ చార్లెస్‌ తన అల్పాహారంలో ఎక్కువగా చీజ్, ఉడకబెట్టిన గుడ్లు, తేనేతో కూడిన డార్జిలింగ్‌ టీ తదితరాలు తీసుకుంటారు. వీటిలోనూ ఎక్కువగా సేంద్రియ ఉత్పత్తులే ఎక్కువ వాడతారు. ఇంత మంచి జీవనశైలి ఉన్నప్పటికీ కింగ్‌ క్యాన్సర్‌ బారినపడటం నిజంగా బాధాకరమని అంటున్నారు.



Tags:    

Similar News