1947 క్యాలెండర్ లో పంద్రాగస్టు రోజును చూశారా?

ఇక.. ఆ రోజు పబ్లిక్ హాలిడే. మీరు ఏ క్యాలెండర్ చూసినా ఆ విషయాన్నిప్రత్యేకంగా పేర్కొనేలా.. డేట్లలోనూ కలర్ తేడా ఉంటుంది.

Update: 2024-08-15 03:40 GMT

ఏడాదిలో మిగిలిన రోజుల సంగతి ఎలా ఉన్నా.. పంద్రాగస్టు.. జనవరి 26 రెండు రోజులు మాత్రం ఒకలాంటి భావోద్వేగం భారతీయుల్లో ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ రెండు తేదీల్లో ఢిల్లీలోని ఎర్రకోట మొదలుకొని గల్లీ వరకు జాతీయ జెండాను ఎగురవేయటం.. ఆ సందర్భంగా నిర్వహించే కార్యక్రమాలు సందడిగా సాగుతుంటాయి. ఇక.. ఆ రోజు పబ్లిక్ హాలిడే. మీరు ఏ క్యాలెండర్ చూసినా ఆ విషయాన్నిప్రత్యేకంగా పేర్కొనేలా.. డేట్లలోనూ కలర్ తేడా ఉంటుంది.

 

అయితే.. 1947 ఆగస్టు క్యాలెండర్ మాత్రం అందుకు మినహాయింపుగా చెప్పాలి. కారణం.. క్యాలెండర్ తయారీ వేళకు.. ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం ఇస్తారన్న అంశంపై క్లారిటీ లేకపోవటం.. డేట్ విషయంలోనూ ఎలాంటి సమాచారం లేకపోవటమే కారణం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన స్పెషల్ రోజును.. క్యాలెండర్ లో మాత్రం సాధారణంగా ఉండిపోయే సిత్రమిది. ఏమైనా.. ఈ రేర్ క్యాలెండర్ ను పంద్రాగస్టున బయటకు వచ్చింది. వైరల్ గా మారింది.

1947 ఆగస్టు క్యాలెండర్ ను చూస్తే.. నాలుగు ఆదివారాలతో పాటు 18, 30 తేదీలు సెలవులుగా పేర్కొన్నారు. కీలకమైన ఆగస్టు 15 మాత్రం సాదాసీదాగా ఉంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే 1947 ఆగస్టు 15 శుక్రవారం వస్తే.. ఈ ఏడాది గురువారం వచ్చింది. మొత్తంగా పంద్రాగస్టు వేళ.. ఈ పాత క్యాలెండర్ ఫోటో వైరల్ గా మారింది. పలువురు దీన్ని షేర్ చేసుకుంటున్నారు.

Tags:    

Similar News