ఏబీవీ సీ ఓటర్ సర్వే : ఏపీలో గెలిచేది ఎవరంటే...!?
ఏపీలో అధికారం చేపట్టబోయేది టీడీపీ కూటమి అని స్పష్టంగా ఈ సర్వే చెప్పేసింది.
ఏపీ రాజకీయాలు హీటెత్తిన వేళ మరో కొత్త సర్వే బయటకు వచ్చింది. ఏబీసీ సీ ఓటర్ సర్వే గా వచ్చిన దాంట్లో చూస్తే సంచలన విషయాలే కనిపిస్తున్నాయి. ఏపీలో అధికారం చేపట్టబోయేది టీడీపీ కూటమి అని స్పష్టంగా ఈ సర్వే చెప్పేసింది.
ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఏకంగా 20 ఎంపీ సీట్లు వస్తాయని తెలిపింది. అలాగే వైసీపీకి 5 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని వెల్లడించింది. అదే విధంగా టీడీపీ కూటమికి 47 శాతం ఓటు షేర్ వస్తుందని, వైసీపీకి 40 శాతం ఓటు షేర్ వస్తుందని ఇతరులకు 11 శాతం ఓటు షేర్ వస్తే కాంగ్రెస్ కి రెండు శాతం ఓటు సేరు వస్తుందని పేర్కొంది.
టీడీపీ కూటమికి 20 ఎంపీ సీట్లు అంటే దాన్ని అసెంబ్లీకి టర్న్ చేస్తే కచ్చితంగా 140 సీట్లతో ఏపీలో కూటమి అధికారం చేపడుతుదని ఈ సర్వే పేర్కొంది. అదే విధంగా వైసీపీకి అయిదు ఎంపీ సీట్లు అంటే 35 ఎమ్మెల్యే సీటు మాత్రమే వస్తాయని వెల్లడించింది.
ఇక తెలంగాణాలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి పది ఎంపీ సీట్లు లభిస్తాయని వెల్లడించింది. అదే విధంగా కాంగ్రెస్ కి 42 శాతం ఓటు షేర్ దక్కుతుందని పేర్కొంది. బీజేపీ కి 5 ఎంపీ సీట్లు దక్కుతాయని అలాగే 26 శాతం మేర ఓటు షేర్ వస్తుందని వివరించింది.
ఇక బీఆర్ ఎస్ కి కేవలం ఒక్క ఎంపీ సీటు వస్తుందని అలాగే 27 శాతం ఓటు షేర్ మాత్రమే దక్కుతుందని పేర్కొనడం విశేషం. అలాగే మజ్లిస్ పార్టీకి రెండు శాతం ఓటు షేర్ తో ఒక ఎంపీ సీటు దక్కుతుందని తెలిపింది. దీనిని బట్టి చూస్తే కాంగ్రెస్ హవా మరో మారు తెలంగాణాలో కొనసాగుతుందని అంటున్నారు. అలాగే బీఆర్ఎస్ పరిస్థితి మరింత దారుణంగా పడిపోతోంది అని ఈ సర్వే ప్రకారం చూస్తే అర్ధం అవుతోంది. ఇక గతసారి కేవలం నాలుగు ఎంపీ సీట్లు తెచ్చుకున్న బీజేపీకి ఈసారి అదనంగా మరో ఎంపీ సీటు దక్కుతుందని తెలుస్తోంది.