ఎయిర్ హోస్టెస్ కేసులో బిగ్ ట్విస్ట్... లాకప్ లో ప్యాంటుతో ఉరి!
అవును... ట్రైనీ ఎయిర్ హోస్టెస్ రూపాల్ హత్య కేసులో నిందితుడిగా విక్రం రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
మహారాష్ట్రలోని అంథేరీ లో ట్రైనీ ఎయిర్ హోస్టెస్ రూపాల్ ఓగ్రే తన ఫ్లాటులో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుడు విక్రం ని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపించారు. ఈ రోజుతో అతడి కస్టడీ ముగియనుంది. ఇంతలోనే ఉహించని సంఘటన జరిగింది.
అవును... ట్రైనీ ఎయిర్ హోస్టెస్ రూపాల్ హత్య కేసులో నిందితుడిగా విక్రం రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం అతడిని పోలీసులు అంథేరీ కోర్టులో హాజరుపర్చారు. దీంతో కోర్టు అతడికి ఈ రోజువరకు పోలీసు కస్టడీ విధించింది. ఈ సమయంలో తాజాగా అతడు లాకప్ లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రూపాల్ ఓగ్రే హత్యకేసులో నిందితుడిగా ఉన్న విక్రం... ఈ రోజు టాయిలెట్ కు వెళ్లి ఎంతసేపటికీ బయటకు రాలేదు. ఎన్నిసార్లు పిలిచినా అతడి నుంచి స్పందన రాలేదు. దీంతో జైలు సిబ్బంది డోర్ పగలగొట్టి చూడగా... అతడు తన ఫ్యాట్ తో ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు అని పోలీసులు తెలిపారు.
ఈ రోజుతో విక్రం పోలీసుల కస్టడీ ముగుస్తుంది. ఈ సమయంలో అతడిని కోర్టు ముందు హాజరుపర్చాల్సి ఉండగా.. ఈరోజు ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక నిందితుడు విక్రం కు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా.. అతడి భార్య కూడా అదే అపార్ట్ మెంట్ లో పని చేస్తోంది.
కాగా... చత్తీస్ గఢ్ కు చెందిన ట్రైనీ ఎయిర్ హోస్టెస్ రూపాల్, మహారాష్ట్రలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని అంథేరీలో ఒక ఫ్లాట్ లో తన సోదరి, ఆమె బాయ్ ఫ్రెండ్ తో కలిసి రూపాల్ నివాసముంటుంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం తన సోదరి, ఆమె బాయ్ ఫ్రెండ్ తో కలిసి తమ గ్రామానికి వెళ్లారు. దీంతో ఈమె ఒంటరిగా ఉంటుంది.
ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా రూపాల్ లిఫ్ట్ చేయలేదు. దీంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఫ్లాట్ కి వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు.
ఎంతసేపటికీ లోపల నుంచి రియాక్షన్ రాకపోవడంతో... తలుపులు పగులగొట్టి చూశారు. దీంతో ఆమె రక్తపు మడుగులో పడి కనిపించింది. దీంతో స్థానికంగా విచారణ జరపగా విక్రం కదలికలు అనుమానాస్పదంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విచారణ అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం రూపాల్ ని గొంతుకోసి హత్యచేసినట్లు అంగీకరించాడు. దీంతో అతడిని కోర్టులో హాజరుపరచగా... కోర్టు రిమాండ్ విధించింది. సరిగ్గా రిమాండ్ ఈ రోజుతో పూర్తవుతుందనగా... ఉదయం బాత్ రుం లో తన ఫ్యాంట్ తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.