ఎన్నికల్లో ఓడినా ..మంత్రి పదవులు గెలిచారు !

లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయినా కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవులు సాధించుకోవడంలో గెలిచారు.

Update: 2024-06-10 11:01 GMT

లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయినా కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవులు సాధించుకోవడంలో గెలిచారు.

తమిళనాడుకు చెందిన మాజీ బీజేపీ అధ్యక్షుడు ఎల్. మురుగన్, పంజాబ్ కు చెందిన బీజేపీ నేత రవ్నీత్ సింగ్ బిట్టూ నిన్న కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

బీజేపీ తమిళనాడు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎల్. మురుగన్ నీలగిరి నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేసి డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా చేతిలో 240585 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 2021లోనే రాజ్యసభకు ఎంపికైన మురుగన్ ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. తమిళనాడులో బీజేపీ ఈసారి బాగా పుంజుకుంది. ఒక్క సీటు కూడా గెలుచుకోనప్పటికీ ఓట్ల శాతం పెరిగింది.ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో తమిళనాడుకు ప్రాతినిధ్యం కల్పించాలని బీజేపీ అధిష్ఠానం భావించింది.

మూడు సార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ నేత రవ్నీత్ సింగ్ బిట్టూ 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. పంజాబ్ లోని అనంత్ పూర్ సాహిబ్ నుంచి, తర్వాత లూథియానా నుంచి లోక్ సభకు ఎన్నికయ్యాడు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలంటే అధికార పార్టీలోనే ఉండాలని చెబుతూ బీజేపీ చేరాడు., ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలైనా . బీజేపీ అధిష్ఠానం ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, ఖలిస్థానీ తీవ్రవాదుల చేతుల్లో హత్యకు గురైన బియాంత్ సింగ్ మనుమడే రవ్నీత్ సింగ్ బిట్టూ.

Tags:    

Similar News