అమరావతి అప్పు డాలర్లలో చెల్లించాలంట!

అమరావతి ఫేజ్-1 డెవలప్మెంట్ కోసం 1600 మిలియన్ డాలర్లు (రూ. 13,600 కోట్లు) నిధులను ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తో కలిసి ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయంగా కట్టుబడి ఉంది అని తెలుస్తోంది.

Update: 2024-10-20 10:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అమరావతి ప్రాముఖ్యతను.. ఆ ప్రాజెక్టును ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది చంద్రబాబు ఇప్పటికే వివరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏపీలో ఏ అంటే అమరావతి అని ఆయన నొక్కి చెప్పారు. ఈ సమయంలో ప్రపంచ బ్యాంక్ నుంచి కేంద్రం రూ.15,000 కోట్లు అప్పు ఇప్పిస్తున్న సంగతి తెలిసిందే.

అమరావతి ఫేజ్-1 డెవలప్మెంట్ కోసం 1600 మిలియన్ డాలర్లు (రూ. 13,600 కోట్లు) నిధులను ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ తో కలిసి ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయంగా కట్టుబడి ఉంది అని తెలుస్తోంది. ఆ మొత్తాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ మొదటి దశలో వ్యయం రూ.15,000 కోట్లు కాగా.. మిగిలిన రూ.1,400 కోట్లను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని అంటున్నారు.

ప్రపంచ బ్యాంకులో భాగమైన ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీ-కనస్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ (ఐ.బీ.ఆర్.డీ) రుణాలు, గ్యారింటీలను అందజేస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) 800 మిలియన్ డాలర్లు (రూ.6,800) కోట్లు సమకూరుస్తుంది! అమరావతి కేపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం పేరుతో వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఈ రుణాలు ఇస్తున్నాయి.

వీటికి సంబంధించిన వివరాలను ప్రపంచ బ్యాంక్ తన వెబ్ సైట్ లో పొందుపరించింది! ఇదే సమయంలో.. ప్రోగ్రామ్ ఫర్ రిజల్ట్స్ ఫైనాన్సింగ్ (పీ ఫర్ ఆర్) విధానంలో రుణం సమకూరుస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ తెలిపింది. అయితే... ఈ అప్పును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని.. కేంద్రం 9.33% మాత్రమే భరిస్తుందని తెలుస్తోంది! ఇదే సమయంలో... అప్పును డాలర్ల రూపంలో చెల్లించాలని అంటున్నారు.

అవును... అమరావతికి ప్రతిపదించిన రూ.15,000 కోట్ల అప్పులో ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ రూ.13,600 కోట్లు ఇవ్వనుండగా.. మిగిలిన రూ.1,400 కోట్లను కేంద్రం ఇవ్వనుందని అంటున్నారు. ఈ అప్పు కాలపరిమితి 50 ఏళ్లు ఉండొచ్చని చెబుతున్నారు. అయితే... డాలర్ విలువకు అనుగుణంగా భారం పెరగనుందని అంటున్నారు!

అందువల్లే అంతర్జాతీయ సంస్థల కంటే దేశీయ సంస్థల నుంచి తీసుకునే అప్పులే ఉత్తమనని నిపుణులు చెబుతున్నారు. మరోపక్క మొదటి దశను రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా పూర్తి చేయగలదో.. రెండో దశకు కూడా వరల్ద్ బ్యాంక్ ముందుకు రావొచ్చని, ఫేజ్-2 నిధులు ఈ వేగంపై ఆధారపడి ఉంటాయని అంటున్నారు!

Tags:    

Similar News