అమెరికా వలస విమానాలు గుజరాత్ కు ఎందుకు వెళ్లడం లేదు?
ఇందులో భాగంగా... తమ దేశంలో గుర్తించిన అక్రమ వలసదారులను మిటలరీ విమానాల్లో వారి వారి స్వదేశాలకు పంపించేస్తున్నారు.
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ అక్రమ వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొలంబియా, మెక్సికో మొదలైన దేశాలతోపాటు భారత్ కు చెందినవారిని సంకెళ్లు వేసి మరీ పంపించేశారు. ఈ సమయంలో అమెరికా వలస విమానాలు అమృత్ సర్ కే ఎందుకు వస్తున్నాయనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... ట్రంప్ 2.0లో ప్రధానంగా అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తమ దేశంలో గుర్తించిన అక్రమ వలసదారులను మిటలరీ విమానాల్లో వారి వారి స్వదేశాలకు పంపించేస్తున్నారు. ఈ సమయంలో గత వారం అమెరికా నుంచి 104 మంది వలసదారులతో కూడిన విమానం అమృత్ సర్ లో ల్యాండ్ అయ్యింది.
ఈ క్రమంలో మరో విమానం వలసదారులతో మళ్లీ పంజాబ్ లోని అమృత్ సర్ లోనే దిగబోతోందని అంటున్నారు. దీంతో... ఇప్పుడు ఈ విషయం వివాదాస్పదమవుతోంది. ఈ సమయంలో అమెరికా నుంచి అక్రమ వలసదారులతో భారత్ వస్తోన్న విమానాలు అమృత్ సర్ కే ఎందుకు వస్తున్నాయనే ప్రశ్నలు మొదలయ్యాయని అంటున్నారు.
వాస్తవానికి అమెరికాలో అక్రమంగా ఉన్న వలసదారుల్లో అత్యధిక మంది గుజరాత్, హర్యానా మొదలైన రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారని అంటున్నారు. అలాంటప్పుడు వారిని పంజాబ్ రాష్ట్రానికి రప్పించి.. అక్కడ నుంచి రోడ్డు మార్గాల్లో వారి వారి స్వస్థలాలకు పంపడం ఎందుకనే చర్చ మొదలైంది. దానికి కారణం పంజాబ్ లో ఉన్నది ఆప్ ప్రభుత్వం కావడమే అని అంటున్నారు!
ఇందులో భాగంగా.. అమృత్ సర్ ను బద్నాం చేయడం కోసమే మోడీ సర్కార్ ఈ స్థాయిలో దిగి ఆలోచిస్తోందని చెబుతున్నారు. ఈ వ్యవహారంపై స్పందించిన పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్... అమెరికా విమానాలు అమృత్ సర్ ఎయిర్ పోర్టుకే వచ్చేలా కేంద్రం ఫిక్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు! దీని వెనుక రాజకీయ వ్యూహాలు పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నారు.
అమెరికాలో ఎక్కువగా అక్రమ వలసదారులుగా ఉన్న బీజేపీ పాలిత రాష్ట్రాలైనా గుజరాత్, హర్యానాలను వదిలి పెట్టి.. పంజాబ్ లో అమెరికా విమానాలను దింపడం ద్వారా తమ రాష్ట్రం పరువు తీస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అందువల్లే అక్రమ వలసదారులను తీసుకొస్తున్న అమెరికా విమానాలు గుజరాత్ లో ల్యాండ్ కావడం లేదని చెబుతున్నారు!