చైనాను వణికిస్తున్న కొత్త సమస్య

పిల్లలు అస్వస్ధతతో ఇబ్బందులు పడుతు ఆసుపత్రులకు చేరుకుంటున్నారు.

Update: 2023-11-24 05:50 GMT

డ్రాగన్ దేశాన్ని ఏదో ఒక ఉపధ్రవం వెంటాడుతునే ఉంది. కరోనా వైరస్ ను ప్రపంచం మీదకు వదిలిన పాపం ఇప్పుడిప్పుడే చైనాను వదిలిపెట్టేట్లు లేదు. తాజాగా న్యుమోనియా రూపంలో అంతుచిక్కని వైరస్ జనాల మీద దాడిచేస్తోంది. మామూలుగా న్యుమోనియా అంటే పెద్దగా భమయపడాల్సిన అవసరంలేదు. డాక్టర్ల పర్యవేక్షణలో సరైన మందులువాడితే కొద్దిరోజుల్లోనే నయమైపోతుంది. కాని ఇపుడు న్యుమోనియా లక్షణాలతో కనబడుతున్న కొత్త సమస్య జనాలను ఎంతకీ వదలటంలేదు.

జనాలు ఎంతమంది డాక్టర్లకు చూపించుకున్నా, ఎన్ని మందులు వాడుతున్నా ఉపసమనం దక్కటంలేదు. చైనాలోని చాలా ప్రావిన్సుల్లోని విద్యాసంస్ధల్లోని చిన్నారులపైన తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పిల్లలు అస్వస్ధతతో ఇబ్బందులు పడుతు ఆసుపత్రులకు చేరుకుంటున్నారు. ఎన్నిరోజులు ఆసుపత్రుల్లో ఉంచి వైద్యం అందిస్తున్నా సమస్య పరిష్కారం కావటంలేదు. బీజింగ్, లియానింగ్, డ్యాంగ్జూ లాంటి ప్రావిన్సుల్లో ఈ ప్రమాదకర న్యుమోనియా సమస్య ఎక్కువగా కనబడుతోంది. కోవిడ్ మహమ్మారి సమస్య ప్రారభందశలో ఎలాగైతే విరుచుకుపడిందో సేమ్ టు సేమ్ ఇపుడు అలాంటి పరిస్ధితుల్లో ప్రావిన్సుల్లోను, ఆసుప్రతుల్లోను కనబడుతోంది.

కొత్త సమస్య ప్రధానంగా లంగ్స్ మీద తీవ్రమైన ప్రభావం చూపుతుండటంతో పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు పెరిగిపోతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఉష్ణోగ్రతలు ఎక్కడైతే తీవ్రంగా పడిపోయి చలి విపరీతంగా పెరిగిపోతోంది అలాంటి ప్రావిన్సుల్లోనే ఇలాంటి మిస్టరీ న్యుమోనియా సమస్యలు పెరిగిపోతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అయితే దీనికి విరుగుడు మాత్రం డాక్టర్లు, వైద్య నిపుణులు చెప్పలేకపోతున్నారు. లంగ్ ఇన్ఫెక్షన్ పెరిగిపోతున్న కారణంగా చిన్నపిల్లలు తట్టుకోలేకపోతున్నారు. అందుకనే వాళ్ళని తల్లి, దండ్రులు వెంటనే ఆసుపత్రుల్లో చేర్చేస్తున్నారు.

దీనివల్ల పై ప్రావిన్సుల్లోని ఆసుపత్రులు ఎక్కువగా చిన్న పిల్లల అడ్మిషన్లతో నిండిపోతోంది. ఇదే విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్ల్యూహెచ్ ఓ) కూడా వెంటనే అప్రమత్తమైంది. ఇతర దేశాల్లోని వైద్య నిపుణులను చైనాకు పంపటానికి ఏర్పాట్లు చేస్తోంది. పిల్లల్లోని అనారోగ్య లక్షణాలను, రక్తపరీక్షల రిపోర్టులను వెంటనే తమకు పంపాలని డబ్ల్యూహెచ్ఓ చైనా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే డబ్ల్యూహెచ్ఓ ఆదేశాలను చైనా ప్రభుత్వం ఎంతవరకు ఆచరిస్తుందో చూడాల్సిందే. మొత్తానికి కరోనా వైరస్ తర్వాత చైనాను ఏదో ఒక వైరస్ ఇబ్బందులు పెడుతున్నది అయితే వాస్తవం.

Tags:    

Similar News