కొడుకులు దిద్దిన వ్యాపారం... అనిల్ అంబానికీ బిగ్ రిలీఫ్!

నష్టాల్లో, అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీకి మంచి రోజులు మొదలైనట్లు కనిపిస్తున్నాయి.

Update: 2024-10-15 07:30 GMT

నష్టాల్లో, అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీకి మంచి రోజులు మొదలైనట్లు కనిపిస్తున్నాయి. రిలయన్స్ పవర్ రుణ రహితంగా మారడంతో పాటు రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తన రుణాన్ని 87% తగ్గించుకొంది. అయితే... దీనికంతటికీ కారణం ఇద్దరు వక్తులు! వారే... అనిల్ అంబానీ కుమారులు అన్మోల్ అంబానీ, అన్షుల్ అంబానీ!

అవును.. రిలయన్స్ పవర్ షేర్లు 5% పెరిగి.. 52 వారాల గరిష్ట స్థాయి రూ.53.65కి చేరుకుంది. దీంతొ చిక్కుల్లో పడిన అనిల్ అంబాన్నీ కీలక పరిణామాన్ని ఎదుర్కోంటున్నారు. ఈ పునరుజ్జీవం.. కంపెనీలపై మళ్లీ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని సూచిస్తుందని అంటున్నారు. ఈ సమయంలో రిలయన్స్ పవర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,052.67 కోట్లు దాటింది.

ఈ సంచలన మార్పుకు కారణం అనిల్ అంబానీ ఇద్దరు కుమారులైన అన్మోల్, అన్షుల్ అని అంటున్నారు. వీరి వ్యూహాత్మక ప్రమేయమే ఈ కీలక మార్పుకు కారణం అని చెబుతున్నారు. రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ ని పునరుజ్జీవింపచేయడంలో అన్మోల్ నాయకత్వం పనిచేసిందని.. ఆయన నాయకత్వంలో పెట్టుబడిదారుల విశ్వాసం తిరిగి పుంజుకుందని అంటున్నారు.

ఇక రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ షేర్లు 60% పెరిగి రూ.336.20కి చేరుకున్నాయి. 2018 నుంచి ఇదే అత్యధిక పెరుగుదల అని చెప్పొచ్చు. ఇదే సమయంలో... రిలయన్స్ ఇన్ ఫ్రా తన ఆర్థిక స్థిరత్వాన్ని బలపరుస్తూ.. ఫారిన్ కరెన్సీ కన్వర్టిబుల్ బాండ్ల ద్వారా రూ.2,930 కోట్లను సమీకరించడానికి ఆమోదం పొందింది.

కాగా... అన్మోల్ అంబానీ చిన్ననాటి నుంచీ నాయకత్వ పాత్రలు పోషించారని చెబుతుంటరు. 2014లో రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్ తో ప్రారంభించి.. 2017లో రిలయన్స్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎదిగాడు అన్మోల్. ఇదే క్రమంలో... రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్ లో తన వాటాను పెంచుకోవడానికి జపాన్ కు చెందిన నిప్పాన్ సంస్థను సులభతరం చేశాయి.

ఇతని డైరెక్షన్ లో రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ క్యాపిటల్ అసెట్ మేనేజ్మెంట్ వంటి వెంచర్లు అభివృద్ధి చెందాయి. ఫలితంగా అతడి నికర విలువ రూ.2,000 కోట్లకు చేరింది!

ఇక అన్షుల్ అంబానీ విషయానికొస్తే... అమెరికన్ స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేసి, న్యూయార్క్ యూనివర్సిటీలోని ప్రతిష్టాత్మకమైన స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. ఈ బలమైన విద్యాపునాది వ్యాపార ప్రపంచంలో సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోడానికి అతన్ని సన్నంధం చేస్తుందని చెబుతారు.

ఈ యువ అంబానీల నేతృత్వంలోని ఈ సమిష్టి కృషి అనిల్ అంబానీ బిలియనీర్ హోదాకు తిరిగి రావడానికి పునాధి వేసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News