వీటిలో జంతువుల కొవ్వు...జర జాగ్రత్త సుమీ !

ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ ఏంటి అంటే జంతువుల కొవ్వు. దాని మీదనే చర్చ సాగుతోంది.

Update: 2024-09-22 20:30 GMT

ఇపుడు ఏపీలో హాట్ టాపిక్ ఏంటి అంటే జంతువుల కొవ్వు. దాని మీదనే చర్చ సాగుతోంది. అది ఏమిటి ఎలా కలుస్తుంది. అసలు ఎక్కడ ఉంటుంది. తినే పదార్ధాలలో వేటి మీద కలవవచ్చు అన్నది కూడా అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంతో జంతువుల కొవ్వు కలిసింది అని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటనతో అంతా ఆవేదన చెందారు.

బాబోయ్ అనుకున్నారు. వాంతులు వచ్చిన వారికి వచ్చి ఉంటాయి. పొరబాటున తినేశామా అని కూడా సందేహించిన వారూ ఉన్నారు. ఇలా వివిధ రకాలైన భావాలతో తెలుగు జనం సతమతం అవుతున్నారు. జంతువుల కొవ్వు లడ్డూ దాకా వచ్చిందా అది నిజమేనా ఒకవేళ అది నిజమో కాదో తెలియక పోయినా వేటిలో జంతువుల కొవ్వు కలసి ఉండొచ్చు అన్నది కూడా చర్చగానే ఉంది.

అయితే వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆహార పదార్ధాల నిపుణులు చెబుతున్నారు. ఈ రోజున చూస్తే ఎవరు ఏమి తింటున్నారో కూడా తెలియదు. ఎవరు ఏమి అమ్ముతున్నారో అంతకంటే తెలియదు. ఎవరికి ఏ పదార్ధం ఇచ్చినా రుచిగా ఉందనే చూస్తున్నారు తప్ప అందులో ఏవి మిక్స్ అయి ఉంటాయో కూడా తెలుసుకోలేరు. అందుకే చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు

వర్తమాన ప్రపంచంలో మనం తినకూడని పదార్ధాలు ఎన్నో తింటున్నామని కూడా అంటున్నారు. అది తెలియకుండానే నోట్లో నుంచి గొంతులోకి పోతోంది అని అంటున్నారు. ఫలితంగా శాకాహారులు ఇబ్బందులే పడుతున్నారు అని అంటున్నారు. కానీ తెలియకుండా వారు కూడా తినేసే సందర్భాలే ఈ ప్రజెంట్ ప్రపంచంలో ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

ఇక చూస్తే వివిధ ఆహరాల ఉత్పత్తులలో జంతువుల కొవ్వుని కూడా మిక్స్ చేస్తున్నారు అని అంటున్నారు. ఇది ఆరోపణలు కాదు అపోహలు అంతకంటే కాదు వాస్తవాలే అని అంటూంటే ఎవరికైనా ఒళ్ళు జలదరించాల్సిందే మరి.

అందులో వనస్పతి అన్నది ఉందని అంటారు. వనస్పతిలో జంతువుల కొవ్వుని ఉపయోగించే అవకాశం ఉంది అని అంటున్నారు. అలాగే కొన్ని రకాలైన బిస్కట్లు అలాగే కుకీలలో కూడా జంతువుల కొవ్వుని మిళాయించి చేస్తున్నారు అని అంటున్నారు. ముఖ్యంగా వెన్నతో భలే రుచి అనిపించే బిస్కట్లలో జంతువుల కొవ్వుని వాడుతారు అని ప్రచారంలో ఉన్న మాట. అందువల్ల కుకీలను వెన్న బిస్కట్లను తీసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

అలాగే కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లలో మాంసం ఆధారిత ఉత్పత్తులలో కూడా జంతువుల కొవ్వుని ఉపయోగిస్తారు అని అంటున్నారు. ఇక ఫాస్ట్ ఫుడ్స్ విషయంలో చెప్పల్సింది లేదని అంటున్నారు. ముఖ్యంగా ఫ్రెంచ్ ప్రైస్, బర్గర్లు ఇలాంటి వాటిలో జంతువుల కొవ్వుని ఉపయోగిస్తున్నారు అని ఆరోపణలు అయితే ఉన్నాయి.

సూపులు స్టాకులలో రుచిని మరింత రెట్టింపు చేయడానికి కూడా జంతువుల కొవ్వుని ఉపయోగిస్తున్నారు అని అంటున్నారు. ఇక పాల ఉత్పత్తులలో ఎక్కువగా జంతువుల కొవ్వుని వాడుతున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రకాలైన జున్నుక్ ప్రాసెస్ చేయబడిన చీజ్ లలో జంతువుల కొవ్వుని వాడేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మంచి షేపు లో ఆకృతిలో ఉన్న చాక్లెట్లు అలగే రుచికరమైన చాక్లెట్ లో కూడా జంతువుల కొవ్వుని వాడుతున్నారని అంటున్నారు. సో ఎక్కడ ఏమి వాడుతున్నారో ఏమిటో ఆ దేవుడికే తెలియాలి.

అందువల్ల ఎవరూ ఏమి తింటున్నారో కూడా అర్ధం కాని పరిస్థితి ఉంది. ఈ బిజీ లైఫ్ లో ఎవరూ ఏమీ చూసుకోవడం లేదు, కంటికి ఇంపుగా రుచిగా ఉంటే చాలు తింటున్నారు. ఫలితంగా వారు ఇబ్బందిలో పడుతున్నారు. చిత్రమేంటి అంటే వారికి తెలిసిన తరువాతనే వామ్మో అని వాంతి చేసుకోవడం జరుగుతుంది. మరి జాగ్రత్త ఎలా అంటే అన్నీ చూసుకోవడమే అని అంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News