ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల... పవన్ శాఖలకు కేటాయింపులివే!

ఈ సందర్భంగా కూటమి పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీల్లో అత్యంత కీలక భూమిక పోషించిన 'తల్లికి వందనం', 'మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం' పై కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-11 07:00 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా... 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2,94,427.25 కోట్లతో వార్షిక బడ్జెట్ ను శాసనసభ ముందుకు తీసుకొచ్చారు.

 

 

అవును... ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,35,916.99 కోట్లు కాగా.. మూలధన వ్యయ్యం అంచనా రూ.32.712.84 కోట్లుగా పేర్కొన్నారు. ఇక రెవెన్యూ లోటు, ద్రవ్య లోటులు వరుసగా... రూ.34,743.38 కోట్లు.. రూ.68.742.65 కోట్లుగా వెల్లడించారు.

 

ఈ సందర్భంగా కూటమి పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీల్లో అత్యంత కీలక భూమిక పోషించిన ‘తల్లికి వందనం’, ‘మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం’ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఎన్ని సవాళ్లు ఎదురైనా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చంద్రబాబు నాయకత్వంలో కృషి చేస్తామని తెలిపారు.

 

ఈ సమయంలోనే... తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనేదే ఈ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని త్వరలో ప్రారంభిస్తామని అన్నారు.

శాఖలవారీగా కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి..!:

బీసీ సంక్షేమం - రూ.39,007 కోట్లు

పాఠశాల విద్య - రూ.29,909 కోట్లు

ఎస్సీ సంక్షేమం - రూ.18,497 కోట్లు

ఆరోగ్య రంగం - రూ.18,421 కోట్లు

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి - రూ.16,739 కోట్లు

జలవనరులు - రూ.16,705 కోట్లు

వ్యవసాయం, అనుబంధ రంగాలు - రూ.11,855 కోట్లు

పట్టణాభివృద్ధి - రూ.11,490 కోట్లు

రవాణా, రోడ్లు, భవనాలు - రూ.9,554 కోట్లు

పోలీస్ శాఖ - రూ.8,495 కోట్లు

ఇందన రంగం - రూ.8,207 కోట్లు

ఎస్టీ సంక్షేమం - రూ.7,557 కోట్లు

మైనార్టీల సంక్షేమం - రూ.4,376 కోట్లు

మహిళా శిసు సంక్షేమం - రూ.4,285 కోట్లు

గృహ నిర్మాణం - రూ.4,012 కోట్లు

పరిశ్రమలు, వాణిజ్యం - రూ.3,127 కోట్లు

ఉన్నత విద్య - రూ.2.326 కోట్లు

మానవ వనరుల అభివృద్ధి - రూ.1,215 కోట్లు

పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ - రూ.687 కోట్లు

యువజన, పర్యాటక, సాంస్కృతికం - రూ.322 కోట్లు

Tags:    

Similar News