షర్మిల పదవికి ఎసరు ?

ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా షర్మిల వచ్చి ఏమి సాదించారు అంటే అన్న జగన్ ని మాజీ సీఎం గా చేయడానికి అన్న సింగిల్ ఆన్సర్ వినిపిస్తుంది

Update: 2024-06-06 16:49 GMT

ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా షర్మిల వచ్చి ఏమి సాదించారు అంటే అన్న జగన్ ని మాజీ సీఎం గా చేయడానికి అన్న సింగిల్ ఆన్సర్ వినిపిస్తుంది. సొంత అన్నకు ఆమె వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ప్రచారం చేశారు. చాలా విషయాల్లో ఏ మాత్రం తడబాటు లేకుండా ఆమె జగన్ ని టార్గెట్ చేశారు. శత్రువులు సైతం చేయని విధంగా చేశారు అన్న కామెంట్స్ వినిపించాయి.

సాధారణంగా ఇద్దరు అన్నదమ్ములు ఉంటే వారసత్వాల విషయంలో భారీగానే వివాదాలు వస్తాయి. అలా రాజకీయాల్లో ఉంటే వేరు పార్టీలలో కచ్చితంగా ఉంటారు. అయితే వారు కూడా ఒక దశను దాటి విమర్శలకు వెళ్ళలేదు అని విజయవాడ కేశినేని బ్రదర్స్ ఉదంతం రుజువు చేసింది.

అదే ఆడపడుచు ఉంటే కచ్చితంగా అన్న మేలు కోరుకుంటుంది అంటారు. కానీ వైఎస్సార్ ఫ్యామిలీలో చిత్రంగా సొంత చెల్లెలే అన్న మీద విమర్శల దాడి చేశారు. ఏపీలో పాలిటిక్స్ మంచి పీక్స్ లో ఉన్నపుడు ఆమె మూడు నెలల పాటు వైసీపీ అధినేత జగన్ మీద చేసిన విమర్శలు భారీ ప్రభావమే చూపాయి. దాంతో కాంగ్రెస్ కి నోటా కంటే తక్కువ వచ్చి చతికిలపడిన పార్టీకి ఈసారి ఏకంగా 2.5 శాతం పైగా ఓట్లు వచ్చాయి.

ఆ ఓట్లు అన్నీ కూడా వైసీపీవే అనడంలో సందేహం లేదు. పైగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ నియోజకవర్గాలలో వైసీపీకి గట్టి దెబ్బ పడింది. మరో వైపు చూస్తే షర్మిల కడపలో ఎంపీగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి లక్షన్నర దాకా ఓట్లను చీల్చారు. దాంతో పులివెందులలో జగన్ మెజారిటీ తగ్గిపోయింది. అలాగే వైసీపీ ఓటమి పాలు అయింది.

Read more!

ఈ నేపధ్యంలో షర్మిల వల్ల ఏపీ కాంగ్రెస్ కి ఎంతవరకూ మేలు జరిగింది అంటే ఆమె నాయకత్వ పటిమ మీద పోరాట పటిమ మీద సీనియర్లు అయితే పెదవి విరుస్తున్నారు. మరో వైపు చూస్తే పార్టీలో కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ లాంటి వారు షర్మిల మీద హాట్ కామెంట్స్ చేసిన నేపధ్యం ఉంది.

ఇపుడు అదే వరసలో ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరి పద్మశ్రీ మీడియా ముందు మాట్లాడుతూ షర్మిల మీద తీవ్ర విమర్శలు చేశారు. షర్మిల ఒంటెద్దు పోకడలు పోయారని ఆమె నిందించారు. అంతే కాదు ఆమెకు పార్టీ ఫండ్ ఇస్తే దాన్ని ఆమె దాచుకున్నారు అంటూ కూడా పద్మశ్రీ కామెంట్స్ చేశారు. కేవలం తన వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు ఆమె ఏపీ వచ్చి రాజకీయాలు చేస్తున్నారు అని ఆమె అన్నారు.

ఎన్నికల ఫండ్ ని ఎవరికీ ఇవ్వకపోవడమేంటి అని ఆమె ప్రశ్నించారు. ఏపీలో కాంగ్రెస్ ఎక్కడా గెలవలేదని, షర్మిల కూడా ఓటమి పాలు అయ్యారని ఆమె దీనిని నైతిక బాధ్యత వహించి తన పదవిని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను కూడా ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామ చేస్తాను ఆమె అంటున్నారు. మొత్తానికి షర్మిల పదవికి ఎసరు పెట్టే విధంగా సీనియర్లు చూస్తున్నారు.

ఏపీలో సీఎం గా జగన్ ఉంటేనే షర్మిలకు కాంగ్రెస్ లో ఎంతో విలువ ఉంటుంది అన్నది నిజం అంటున్నారు. అన్న మీద ఆమె పోరాటం వల్ల కలసి వస్తుందని అంచనాతో ఆ పదవి ఇచ్చారు. ఇపుడు ఏపీలో టీడీపీ కూటమి వచ్చింది. దాంతో షర్మిల నాయకత్వం మీదనే చాలా మంది బాహాటంగా విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఈ విషయంలో ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. షర్మిల వల్ల పెద్దగా లాభం లేదు అనుకున్నపుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చేసే పార్టీ ప్రక్షాళనలో భాగంగా ఏపీ సీటు కూడా ఎగిరిపోవచ్చు అని అంటున్నారు.

Tags:    

Similar News