చెట్టు సైజు, రిబ్బన్ రంగు నచ్చలేదని... ఎమ్మెల్యే షాకింగ్ వీడియో!

నివేదికల ప్రకారం... చువాపాట దైఖోవా మార్కెట్ వద్ద వంతెన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు తూర్పు బిలాసిపారా ఎమ్మెల్యే సంషుల్ హుడా.;

Update: 2025-03-21 06:39 GMT
Assam Mla Samsul Huda Controversy

వంతెన శంకుస్థాపన కార్యక్రమంలో తాను అడిగిన హైట్ లో అరటి మొక్కలు పెట్టలేదని.. తాను కోరిన రంగు రిబ్బన్ కట్టలేదని.. తనలో అంతర్లీనంగా ఉండి ప్రపంచానికి కనిపించని మనిషిని బయటకు రప్పించారు ఓ ఎమ్మెల్యే! ఇందులో భాగంగా... ఆ కార్యక్రమాన్ని నిర్వహించే నిర్మాణ సంస్థ ఉద్యోగిపై చెయ్యి చేసుకున్నారు.. అరటి మొక్క పీకి దాడి చేశారు.

అవును... శంకుస్థాపన కార్యక్రమంలో అస్సాంలోని తూర్పు బిలాసిపారాకు చెందిన ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే షంసుల్ హుడా బహిరంగంగా ఓ వ్యక్తిని చేతితోనూ, ఆ తర్వాత అక్కడే పాతిన అరటి చెట్టుతోనూ కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఖేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నివేదికల ప్రకారం... చువాపాట దైఖోవా మార్కెట్ వద్ద వంతెన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు తూర్పు బిలాసిపారా ఎమ్మెల్యే సంషుల్ హుడా. అయితే.. ఈ కార్యక్రమానికి జరిగిన ఏర్పాట్లపై ఆయన అసంతృప్తిగా ఉన్నారంట. ప్రధానంగా రిబ్బన్ రంగు.. అది కట్టిన అరటి చెట్ల సైజు విషయంలో అతను చాలా సీరియస్ గా ఉన్నాడని అంటున్నారు.

వాస్తవానికి ఈ కార్యక్రమం కోసం పొడవైన అరటి చెట్లు ఏర్పాటు చేయాలని.. వాటికి ఎరుపు రంగు రిబ్బన్ కట్టాలని ఎమ్మెల్యే ఆ(దే)శించారట! అయితే.. నిర్వాహకులు మాత్రం ఒకటిన్నర అడుగుల ఎత్తు మాత్రమే ఉన్న అరటి మొక్కలు, వాటికి పింక్ కలర్ రిబ్బన్ ను ఏర్పాటు చేశారంట. దీంతో.. అతను రిబ్బన్ కట్ చేయాలంటే వంగాల్సిన పరిస్థితి.

ఈ సమయంలో కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్యే హుడా... తన పక్కనే నిల్చుని ఉన్న నిర్మాణ సంస్థ ఉద్యోగి సోహిదుర్ రెహమాన్ ను కాలర్ పట్టుకుని లాగి గట్టిగా చెంపపై కొట్టారు. అక్కడిగో ఆగ్రహం చల్లారలేదో ఏమో కానీ.. అక్కడున్న అరటి మొక్కను పెకిలించి అతనిని కొట్టడం ప్రారంభించాడు. ఈ సమయంలో అక్కడున్నవారు అతనిని ఆపడానికి ప్రయత్నించారు.

ఈ గొడవ జరిగిన (మార్చి 18) రాత్రి రెహమాన్ గౌరీపూర్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు. దీంతో... భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 115(2), 352, 351(2) కింద కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఈ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం హిమంత్ బిస్వా శర్మను రెహమాన్ కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News