టీడీపీలో అయ్య‌న్న ఆరాటం చూశారా...!

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు

Update: 2023-07-29 05:31 GMT

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు.. జోడు ప‌ద‌వుల‌పై ఆశ‌లు పెట్టుకున్నా రు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయ్య‌న్న త‌న‌కుమారుడు , ప్ర‌స్తుతం పార్టీలో దూకుడుగా ఉన్న యువ నేత చింతకాయల విజ‌య్‌ను అసెంబ్లీకి పంపించాల‌ని ఆయ‌న క‌ల‌లు కంటున్నారు. నిజానికి గ‌త ఎన్నిక‌ల స‌మ‌యం లోనే అయ్య‌న్న ఈ ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. అప్ప‌ట్లో పోటీ తీవ్రంగా ఉంద‌ని భావించి.. విజ‌య్‌కు చంద్ర‌బాబు చాన్స్ ఇవ్వ‌లేదు.

ఇక‌, అయ్య‌న్న టికెట్ తీసుకున్నా.. ఓడిపోయారు. స‌రే.. నాలుగేళ్లు గ‌డిచిపోయాయి. ఈ నాలుగేళ్ల కాలం లో త‌మ గ్రాఫ్ చూడాల‌ని.. తమ కుమారుడు ఏ విధంగా పార్టీ కోసం ప‌నిచేస్తున్నాడో చూడాల‌నేది అయ్య న్న ఆలోచ‌న‌. ఇది బాగానే ఉంది. విజ‌య్ కూడా దూకుడుగా ఉన్నారు వైసీపీపై పోరాటాల్లోనూ ఆయ‌న పాల్గొన్నారు. కేసు న‌మోదైన‌ప్పుడు కూడా. వెనుదిరిగి చూసుకోకుండా ముందుకు సాగారు. సో.. అన్ని విధాలా టికెట్ ఇచ్చేందుకు అర్హులే. ఈ మాట పార్టీలోనూ వినిపిస్తోంది.

అయితే.. ఇక్క‌డే అయ్య‌న్న మ‌రో వాద‌న తెర‌మీదికి తెస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆయ‌న కు కూడా పార్టీ త‌ర‌ఫున‌ కీల‌క ప‌ద‌విని ఇప్పించాల‌ని కోరుతున్నారు. అంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు సీటును అయ్య‌న్న కోరుకుంటున్నార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. కానీ, ఈ విష‌యంలో మాత్రం చంద్ర‌బాబు క‌రాఖండీగా ఉన్నార‌ని అంటున్నారు సీనియ‌ర్లు. ఒక్క టికెట్ కంటే ఇచ్చేది లేద‌ని.. పార్టీలో ప‌ద‌వులు ఇస్తామ‌ని అయ్య‌న్నకు తేల్చి చెప్పార‌ని స‌మాచారం.

దీంతో అయ్య‌న్న ఆవేద‌న‌లో ఉన్నార‌ని మ‌రో వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది. అంత‌కు ముందు నిత్యం మీడియా ముందుకు వ‌చ్చి  వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించేవారు. అయితే.. ఇప్పుడు కాస్త ఆలోచ‌న‌లో ప‌డ్డార‌ని స‌మాచారం. మొత్తంగా చూస్తే.. అయ్య‌న్న ఆలోచ‌న బాగున్నా.. పార్టీలో ఆశావ‌హులు పెరుగుతుండ‌డంతో అధినేత ప‌రిస్థితి కూడా ఇర‌కాటంలోనే ఉంద‌ని అందుకే టికెట్ ఇవ్వ‌లేక పోతున్నార‌ని చ‌ర్చ సాగుతోంది. దీంతో అయ్య‌న్న అభిమానులు.. పూజ‌లు, వ్ర‌తాలు అంటూ.. ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు చేస్తున్నార‌ట‌.

Tags:    

Similar News