బీయారెస్ కి అంత వీజీ కాదు...!
ఈ నేపధ్యం నుంచి చూస్తే అపుడే సర్వేలు వస్తున్నాయి. అవన్నీ కూడా తెలంగాణాలో బీయారెస్ కి అంత ఈజీ కాదని తేల్చేస్తున్నాయి.
హ్యాట్రిక్ విజయం తమ సొంతం. వందకు వంద సీట్లు పక్కా అంటూ బీయారెస్ నేతలు గత కొన్నాళ్ళుగా గట్టిగానే జబ్బలు చరుస్తూ వచ్చారు. కానీ ఇపుడు అసలైన సమయం వచ్చేసింది. సాధారణంగా భారతీయ ఓటరు ఎన్నికల మీద పూర్తి సీరియస్ గా ఉండేది నోటిఫికేషన్ వెలువడిన తరువాతనే. అపుడే తన మనసులో మాటను సర్వేశ్వరులకు చెబుతారు.
ఎందుకంటే నోటిఫికేషన్ తో ప్రభుత్వానికి అధికారాలు ఉండవు. కేర్ టేకర్ గా ఉంటుంది. దాంతో ఓటరు అపుడు పెదవి కదిలించే స్వేచ్చను పొందుతాడు. ఉన్న ప్రభుత్వం మీద తనకు ఉన్న అభిప్రాయాన్ని అసంతృప్తిని స్పష్టంగా బయటపెడతారు.
ఈ నేపధ్యం నుంచి చూస్తే అపుడే సర్వేలు వస్తున్నాయి. అవన్నీ కూడా తెలంగాణాలో బీయారెస్ కి అంత ఈజీ కాదని తేల్చేస్తున్నాయి. ఇక ఎడ్జ్ ఏమైనా ఉందంటే అది కాంగ్రెస్ కే అని కూడా చెబుతున్నాయి. ఫేక్ సర్వేలు అని బీయారెస్ నేతలు హరీష్ లాంటి వారు కొట్టి పారేయవచ్చు కానీ కర్నాటకలో బీజేపీ అలాగే ఎకసెక్కమాడి ఇపుడు అపోజిషన్ బెంచ్ లలో కూర్చుంది.
సో సీరియస్ గానే బీయారెస్ ఈ సర్వేల మీద దృష్టి పెట్టాలి. ఏబీపీ, సీ ఓటర్ సర్వే ప్రకారం చూస్తే అధికారానికి హోరా హోరీ పోరు తప్పదనే అంటున్నారు. బీయారెస్ కంటే కూడా ఓట్లు సీట్ల విషయంలో కాంగ్రెస్ ముందు ఉండడం ఈ సర్వే విశేషం. బీయారెస్కి 43 నుంచి 55 సీట్ల దాకా చాన్స్ ఉంది అని ఈ సర్వే చెబుతూంటే కాంగ్రెస్ 48 నుంచి 60 దాకా చాన్స్ ఇస్తోంది. అంటే మ్యాజిక్ ఫిగర్ ని కాంగ్రెస్ సంపాదించేదిగా ఉంది అంటోంది.
ఇది ఎన్నికల నోటిఫికేషన్ నాటి మాట. ఇంకా యాభై రోజులు చేతిలో ఉన్నాయి. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే తెలంగాణా ఓటర్ కూడా ఫుల్ సీరియస్ గా ఈ వైపు చూస్తే అపుడు నంబర్లు ఇంకా మారే చాన్స్ ఉంది. ఇప్పటికి అయితే ఒపీనియన్ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉందనే అంటున్నారు. ఇక బీజేపీ ఆశలు ఎన్ని పెట్టుకున్నా ఓట్లు పెరుగుతాయి తప్ప సీట్లు మాత్రం సింగిల్ డిజిట్టే అన్నది సర్వేశ్వరుల మాట
ఏబీపీ, సీ ఓటర్ సర్వే అయితే బీజేపీకి 5 నుంచి 11 దాకా సీట్లు ఇచ్చింది. ఒక ఓటింగ్ పర్సంటేజ్ ని 16 శాతంగా ఇచ్చింది. అయితే ఇది గత ఎంపీ ఎన్నికల కంటే కూడా తక్కువే అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ అధికారం అన్న మాటను మరచిపోయేలా తొలి సర్వేలు ఉన్నాయి. ముందు ముందు బీజేపీ ఎలా సర్దుకుంటుందో చూడాల్సి ఉంటుంది అంటున్నారు. ఇక బీయారెస్ హ్యాట్రిక్ విజయానికి ఎలా దారి చూసుకుంటుంది అన్నది కేసీయార్ చాణక్యం మీదనే ఆధారపడి ఉంది అంటున్నారు.