బుచ్చయ్య...దుర్గేష్ ఇద్దరికీ చాన్స్...!

ఏపీలో హాట్ సీట్లలో ఒకటిగా రాజమండ్రి రూరల్ తయారైంది. ఈ సీటు విషయంలో ఇద్దరు బలమైన నేతలు పోటీ పడుతున్నారు.

Update: 2024-02-25 13:30 GMT

ఏపీలో హాట్ సీట్లలో ఒకటిగా రాజమండ్రి రూరల్ తయారైంది. ఈ సీటు విషయంలో ఇద్దరు బలమైన నేతలు పోటీ పడుతున్నారు. అది టికెట్ ని సాధించేందుకు అని అంటున్నారు. రాజమండ్రి రూరల్ నుంచి వరసగా రెండు సార్లు గెలిచిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి 2024లో కూడా తాను అక్కడ నుంచే పోటీ చేస్తాను అని పట్టుబట్టి కూర్చున్నారు.

ఆయన ధీమా అలాంటిది అని అంటున్నారు. గోరంట్ల పోటీ చేస్తే విజయం ఖాయమని కూడా ఆయన అనుచర వర్గం అంటోంది. ఇక కందుల దుర్గేష్ జనసేన నుంచి పోటీకి అదే సీటు కోరుకుంటున్నారు. ఆయన 2019లో 23 వేల పైగా ఓట్లు సాధించారు. బలమైన నేతగా ఉన్నారు. ఈసారి తనదే ఆ సీటు అని ఆయన కూడా చెబుతున్నారు.

టీడీపీ జనసేన పొత్తులో రాజమండ్రి రూరల్ అతి పెద్ద చిక్కుముడిగా మారిపోయింది. ఈ ఇద్దరూ బలవంతులే. రాజకీయంగా ఇద్దరూ గట్టిగానే ఉన్నారు. ఎవరికి సీటు ఇవ్వాలి అన్నది అధినేతలకు పెద్ద పజిల్ గా మారింది. అయితే దీని మీద టీడీపీ అధినేత చంద్రబాబు రాజీ ఫార్ములాను రూపొందించారు అని అంటున్నారు.

ఇద్దరూ నేతలూ స్ట్రాంగ్ గా ఉన్న నియోజకవర్గాల్లో ఏ ఒక్కరినీ అసంతృప్తి పరచకుండా ఇద్దరికీ సీట్లు ఇవ్వాలన్నదే ఆ రాజీ ఫార్ములా. అయితే పక్క పక్కన నియోజకవర్గాలలో సీట్లు ఇవ్వడం ద్వారా ఇద్దరినీ పోటీ చేయించాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు.

ఈ నేపధ్యంలో నిడదవోలు సీటు ఇపుడు చర్చకు వస్తోంది. ఈ సీటు నుంచి పోటీకి ఎవరిని పోటీకి పెడితే బాగుంటుంది ఉంటుంది అన్నది కొత్త చర్చగా ముందుకు వస్తోంది. నిడదవోలు లో కూడా జనసేన టీడీపీకి విడిగా ఉమ్మడిగా బలం ఉంది. అలా రెండు సీట్లను కైవశం చేసుకోవచ్చు ఇద్దరు అభ్యర్ధులను గెలిపించుకోవచ్చు అన్నది ఈ రాజీ ఫార్ములా ఉద్దేశ్యం.

దీన్ని కేవలం రాజమండ్రి రూరల్ కోసమే కాకుండా ఏపీలో ఇలా జనసేన టీడీపీకి బలం సమంగా ఉన్న ప్రతీ నియోజకవర్గంలోనూ అమలు చేయడం ద్వారా పార్టీలో నేతల మధ్య విభేదాలు లేకుండా చూసుకోవాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. అయితే నిడదవోలులో ఎవరిని పోటీకి పెడతారు అన్నదే చూడాలని అంటున్నారు.

ఇక జనసేన నేత కందుల దుర్గేష్ అనుచరులు అయితే తమ నేతకు రాజమండ్రి రూరల్ నే కావాలని పట్టుబడుతున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా అక్కడ నుంచే పోటీకి పట్టుబడుతున్నారు. మరి ఈ విషయంలో ఎవరో ఒకరు తగ్గితే కనుక ఇది మంచి రాజీ ఫార్ములాయే అవుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Full View
Tags:    

Similar News