ఐఏఎస్ శ్రీలక్ష్మి అంటే బాబుకు ఎంత ఉందంటే...?

అంతకంటే ముందు చంద్రబాబును వ్యక్తిగతంగా కలిసేందుకు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లు ప్రయత్నించగా వారికి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదని అంటున్నారు.

Update: 2024-06-14 05:02 GMT

ఏపీలో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు నాయుడు ఆల్ ఇండియా సర్వీసులకు చెందిన అధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు, తెరపైకి వచ్చిన కొన్ని సన్నివేశాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీ, పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు, సునీల్ కుమార్ వంటివారి విషయం వైరల్ గా మారింది!

అవును... గురువారం సాయంత్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబుని సచివాలయంలో కలిసి అభినందనలు తెలియజేసేందుకు వచ్చిన అధికారులను ఉద్దేశించి కాసేపు మాట్లాడారు. ఇందులో భాగంగా... గత ఐదేళ్లలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ లు వ్యవహరించిన తీరు చాలా బాధ కలిగించిందని.. చాలా అన్యాయంగా ప్రవర్తించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనంతరం... రాష్ట్రంలో గత ఐదేళ్లలో చూసినంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవని తెలిపిన చంద్రబాబు... ఏమి జరిగిందనే విషయం ఇప్పుడు వివరంగా మాట్లాడాలనుకోవడం లేదని అన్నారు. ఇక, తనపై పవిత్రమైన బాధ్యత ఉందని, మళ్లీ పరిపాలనను గాడిలో పెడతానని, వచ్చే ఒకటి రెండు రోజుల్లో పూర్తిచేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయని అన్నారు.

అంతకంటే ముందు చంద్రబాబును వ్యక్తిగతంగా కలిసేందుకు పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లు ప్రయత్నించగా వారికి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. వీరిలో ప్రధానంగా శ్రీలక్ష్మీ, అజయ్ జైన్, పీ.ఎస్.ఆర్. ఆంజనేయులు, సునీల్ కుమార్ వంటి వారు ఉన్నారని తెలుస్తుంది. ఈ సందర్భంగా ఐఏఎస్ శ్రీలక్ష్మీ... చంద్రబాబుకు బొకే ఇస్తుండగా ఆయన తిరస్కించడం వైరల్ గా మారింది.

Tags:    

Similar News