ఫ్యామిలీ ప్యాకేజెస్...బాబుకు మొహమాటమ్స్ ..!

టీడీపీ అధినేత మొహమాటాలకు పోతారని పేరు. ఆయన ఎన్ని మాటలు చెప్పిన చివరాఖరులో మాత్రం తగ్గుతారు.

Update: 2024-01-22 04:12 GMT

టీడీపీ అధినేత మొహమాటాలకు పోతారని పేరు. ఆయన ఎన్ని మాటలు చెప్పిన చివరాఖరులో మాత్రం తగ్గుతారు. టికెట్లు ఇస్తారు. ఇదే విధానం మొదటి నుంచి కొనసాగుతోంది. అయితే 2024 లో మాత్రం అలా కాకూడదు అని బాబు భావిస్తున్నారు. అయితే సీనియర్లు ఘనత వహించిన రాజకీయ కుటుంబాల నుంచి చంద్రబాబు మీద వత్తిళ్ళు పెరుగుతున్నాయి.

రాయలసీమలో పరిటాల ఫ్యామిలీకి రెండు టికెట్లు కావాల్సి ఉంది. రాప్తాడులో మాజీ మంత్రి పరిటాల సునీత ఈసారికి పోటీ చేస్తాను అంటున్నారు. 2029లో రాజకీయాలకు స్వస్తి అంటున్నారు. తనకు తన కుమారుడు శ్రీరామ్ కి రెండు టికెట్లు అని ఆమె బాబుని కోరుతున్నారు. ధర్మవరంలో శ్రీరామ్ 2024 ఎన్నికల్లో పోటీకి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

అయితే చంద్రబాబు అలా కాదు ఒక్క టికెటే ఫ్యామిలీకి ఇస్తామని అంటున్నారు. ఆ టికెట్ లోనే తల్లీ కొడుకులలో ఎవరో ఒకరు పోటీ చేయండి అన్నట్లుగా టీడీపీ అధినాయకత్వం సూచిస్తోంది. కానీ పరిటాల ఫ్యామిలీ తగ్గడంలేదు అని అంటున్నారు. ఇదొక సమస్యగా మారింది అని అంటున్నారు.

ఇక జేసీ ఫ్యామిలీలో కూడా రెండు టికెట్ల గొడవ ఉంది. జేసీ అస్మిత్ అయితే తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా కన్ ఫర్మ్ అంటున్నారు. జేసీ పవన్ విషయమే తెలియడంలేదు. ఆయన అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు. మరి ఆయనకు టికెట్ ఇచ్చేది లేదన్నది టీడీపీ పెద్దల నుంచి వస్తున్న మాట. దాంతో పాటు అక్కడ వేరే వారిని కూడా టీడీపీ రెడీ చేసి ఉంచుకుంది. దాని మీద జేసీ బ్రదర్స్ అసహనంగా ఉన్నారని టాక్.

ఇక కోట్ల ఫ్యామిలీ అయినా కేయీ ఫ్యామిలీ అయినా ఈసారి ఒక్కటే టికెట్ అని క్లారిటీగా టీడీపీ హై కమాండ్ చెప్పేస్తోంది. అదే విధంగా భూమా ఫ్యామిలీకి ఒక్కటే టికెట్ అని అంటోంది. ఉత్తరాంధ్రాలో చూసుకుంటే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు రెండు టికెట్లు కోరుతున్నారు. దానికి నో చెబుతోంది హై కమాండ్ ఎంపీ ఎమ్మెల్యే టికెట్లు తన ఫ్యామిలీకి ఇవ్వాల్సిందే అని అయ్యన్న పట్టుబడుతున్నారు.

అదే విధంగా చూస్తే విజయనగరం లో పూసపాటి ఫ్యామిలీ కి చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు కుమార్తెకు తనకు రెండు టికెట్లు అంటున్నారు. ఆయన విషయంలో ఇదే రకమైన సమాధానం వస్తోంది. శ్రీకాకుళంలో చూసుకుంటే మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు రెండు టికెట్లు అని డిమాండ్ చేస్తున్నారు. ఆయనకు కూడా ఒక్కటే అని చెబుతున్నారుట.

ఇలా చూసుకుంటే కనుక తండ్రులు కుమారులు కుమార్తెలు ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంది. కొన్ని చోట్ల అయితే కుటుంబ సభ్యులు ఎవరికీ టికెట్లు ఇవ్వమని కూడా చెబుతున్నారుట. టీడీపీ ఈసారి ఎక్కువగా కొత్త ముఖాలతో వెళ్లాలని చూస్తోంది. అలాగే సీనియర్లను బ్యాలెన్స్ చేయాలనుకుంటోంది. కానీ ఈ డిమాండ్లు చికాకు పెడుతున్నాయట. చంద్రబాబు ఒక చోట కనుక మోహమాటానికి పోతే మాత్రం అన్ని చోట్ల ఫ్యామిలీ ప్యాక్ కి తెర లేచినట్లే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News