క్యాంపస్ లో కొత్త రూల్స్... హిజాబ్, టీషర్ట్, చిరిగిన జీన్స్ వద్దు!

అవును... క్యాంపస్ లో ఉన్నప్పుడు విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించిన చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ... తాజాగా చిరిగిన జీన్స్, టీ షర్ట్ పైనా నిషేధం విధించింది.

Update: 2024-07-03 08:39 GMT

ఇటీవల కాలంలో క్యాంపస్ లలో హిజాబ్ లు ధరించడంపై ఆంక్షలు విధిస్తూ పలు కాలేజీలు నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే! ఇది అత్యంత సున్నితమైన విషయం అనేది తెలిసిందే. ఈ క్రమంలో కాలేజీ ఆవరణలో ఇప్పటికే హిజాబ్ ధరించడాన్ని నిషేదించిన ఓ ఎడ్యుకేషన్ సొసైటీ... తాజాగా టీషర్టులు, చిరిగిన జీన్స్ (టాన్), క్యాప్స్, బ్యాడ్జెస్, మొదలైనవాటిని ధరించడాన్ని నిషేదించింది.

అవును... క్యాంపస్ లో ఉన్నప్పుడు విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించిన చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ... తాజాగా చిరిగిన జీన్స్, టీ షర్ట్ పైనా నిషేధం విధించింది. తమ కాలేజీకి వచ్చే స్టూడెంట్స్.. మతపరమైన, సాంస్కృతికపరమైన అసమానతలను సూచించే దుస్తులను ధరించవద్దని ఆదేశించింది. ఫార్మల్, డీసెంట్ దుస్తులతోనే కాలేజీలకు రావాలని ఆదేసిస్తూ.. అమ్మాయిలకు, అబ్బాయిలకు ప్రత్యేకంగా పలు సూచనలు చేసింది.

ఇందులో భాగంగా క్యాంపస్ లో ఉన్నప్పుడు విద్యార్థులు ఫార్మల్, డీసెంట్ దుస్తులు ధరించాలని.. అబ్బాయిలు హాల్ఫ్ హ్యాండ్స్ షర్ట్, ఫుల్ హ్యాండ్స్ షర్ట్, ట్రౌజర్ ధరించవచ్చని తెలిపింది. ఇదే సమయంలో... అమ్మాయిలు భారతీయ, పాశ్చాత్య దుస్తులను ధరించవచ్చంది. అయితే... మతాన్ని బహిర్గతం చేసే.. లేదా, సాంస్కృతిక అసమానతలను ప్రతిభింబించే ఎలాంటి దుస్తులూ ధరించకూడదని ఆదేశాలు జారీ చేసింది.

ప్రధానంగా చిరిగిన జీన్స్, టీ షర్టులు, రివీలింగ్ డ్రెస్సులు, జెర్సీలు అనుమతించబడవని నోటీసు విడుదల చేసింది. అయితే కాలేజీకి వచ్చీన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న సాధారణ గదులకు వెళ్లి హిజాబ్, బుర్కా, నఖాబ్, స్టోల్స్, క్యాప్స్, బ్యాడ్జెస్ లను తొలగించాలని.. క్యాంపస్ లో ఉన్నంత సమయం వాటిని అనుమతిలేదని జూన్ 27 - 2024 నాటి నోటీసులో పేర్కొంది.

ఈ నేపథ్యంలో వ్యవహారం బాంబే హైకోర్టుకు చేరింది. ఈ మేరకు పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇది ఏకపక్ష నిర్ణయమని, పూర్తిగా అసమంజసమైనదని, దుర్మార్గం అని పేర్కొన్నారు. అయితే... కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం చేసుకోలేమని న్యాయమూర్తులు చెబుతూ... ఈ పిటిషన్ ను కొట్టివేశారు.

Tags:    

Similar News