బ్లాక్ & బ్లాక్ లో కండలు తిరిగిన కేసీఆర్ కటౌట్ చూశారా?

గతకొంతకాలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్న చిత్ర విచిత్రాల సంగతి తెలిసిందే.

Update: 2023-10-08 06:34 GMT

గతకొంతకాలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్న చిత్ర విచిత్రాల సంగతి తెలిసిందే. అటు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లోనీ ఈ ఏఐ సేవలు విసృతంగా వినియోగింపబడుతున్నాయి. ఉదాహరణకు కేరళ ట్రాఫిక్ పోలీసులు ఏఐ ఆధారిక సీసీ కెమెరాలను ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో వెలువడుతున్న కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

అవును... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కొంతమంది ఔత్సాహికులు... తమ తమ అభిమాన హీరోలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, ప్రముఖులకు సంబంధించిన ఫోటోలను తమదైన అభిరుచితో, డ్రీం పిక్స్ తయారుచేస్తున్నారు. ఆ పిక్స్ లో తమ తమ అభిమాన వ్యక్తులను చూసుకుని మురిసిపోతున్నారు. అనంతరం ఇవి షోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి.

ఈ క్రమంలో ఇటీవల తుఫాకులు, అగ్నిపర్వాతాలు, నదీ ప్రవాహాలు, మొదలైన వాటితో మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్, ప్రభాస్, బన్నీ మొదలైన హీరోల పిక్స్ వైరల్ చేస్తిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ప్రభాస్ భార్య, పిల్లలు అంటూ మరికొన్ని ఏఐ పిక్స్ వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ పిక్స్ తాజాగా సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి.

కేజీఎఫ్ సినిమాలోని హీరో తరహాలో.. గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి టైపులో, దాని మాతృక లూసీఫర్ లో మోహన్ లాల్ లా... కేసీఆర్ మాస్ అప్పీల్ లో కనిపిస్తున్న కొన్ని ఏఐ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ & బ్లాక్ లో కండలు తిరిగిన కటౌట్ గా కారు పక్కన నిలిచున్న కేసీఆర్ పిక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇదే సమయంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోల బృందం వెనుక బందోబస్తుగా కదులుతుండగా... వైట్ & వైట్ ధరించిన కేసీఆర్ అభివాదం చేసుకుంటూ చారిత్రాత్మకమైన పాత పార్లమెంట్ భవనం వెలుపల మాస్ బ్యాంక్ గ్రౌండ్ తో షికారు చేస్తున్న దృశ్యం కనిపిస్తుంది.

మరో పిక్ లో తన ఎన్నికల గుర్తు కారు ముందు బ్లాక్ & బ్లాక్ దుస్తుల్లో, బ్లాక్ స్పెక్టికల్స్ లో.. వెనుక పోలీసులు, బీఆరెస్స్ జెండాలు చేతపట్టిన కార్యకర్తలు భారీ సంఖ్యలో నిలిచి ఉండగా... కేసీఆర్ నడుముపై చేతులు పెట్టి మాస్ లుక్ లో నిలబడ్డారు. వీటికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒకటే తక్కువ అన్నట్లుగా ఉన్నాయి ఈ పిక్స్!

అనంతరం తెల్ల పంచె, నల్ల షర్టు ధరించిన కేసీఆర్ బ్లాక్ గాగుల్స్ ధరించి... వెనుక వేలాది మంది జనం పాత పార్లమెంటు భవనం ముందు నిలిచి ఉండగా... బ్లాక్ కమేండోళ్లు వెనుక కదం తొక్కి కదులుతుండగా... వారి ముందు కేసీఆర్ మాస్ లుక్ లో నడుస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. ఏది బెస్ట్ అని చెప్పడం కష్టమనే కామెంట్లూ వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News