‘నువ్వా – నేనా’... హరియాణాలో ఏమి జరుగుతోంది?
అవును... హరియాణా ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రసవత్తర పొరు సాగుతోంది.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణ క్షణం ఉత్కంఠ రేపు తున్నాయి.. రౌండ్ రౌండ్ కీ లెక్కలు మారిపోతున్నాయి. కౌంటింగ్ ప్రారంభమైన ఈ రోజు ఉదయం కాంగ్రెస్ వైపు అనుకూలంగా ఉన్నట్లు కనిపించినా.. మధ్యాహ్నం సమయానికి లెక్కలు పూర్తిగా మారిపోయాయి! ఈ సమయంలో హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీకి అనుకూల ఫలితాలు వస్తున్నాయి!
అవును... హరియాణా ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య రసవత్తర పొరు సాగుతోంది. తాజా ఫలితాల ప్రకారం బీజేపీ కూటమి ఆధిక్యంలో ఉంది. ఇందులో భాగంగా... బీజేపీ 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ 34 స్థానాల్లో తన ఆధిక్యాన్ని కొనసాగిస్తోంది. ఇండియన్ నేషనల్ లోక్ దల్ (ఐ.ఎన్.ఎల్.డి.) రెండు స్థానాల్లోనూ, ఇతరులు 4 స్థానాల్లోనూ ఆధిక్యంలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో హరియాణాల్లో హ్యాట్రిక్ దిశగా బీజేపీ దూసుకెళ్తున్నట్లు భావించొచ్చు! ఈ క్రమంలో పలువురు ప్రముఖులు వెనుకంజలో ఉన్నారు. ఇందులో భాగంగా... రెజ్లర్ వినేశ్ పోగట్ వెనుకంజలో ఉన్నారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 మంది సభ్యుల అవసరం కాగా.. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే... బీజేపీ హ్యాట్రిక్ దిశగా దూసుకెళ్తుంది!
ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల ఫలితాలపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఇందులో భాగంగా... ఆఖరి విజయం కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. కాగా... ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచిన సంగతి తెలిసిందే.