భారతీయుడి పేరుపై వెటకారం... సారీ చెప్పి 10,000 డాలర్లు చెల్లించిన కంపెనీ!
వివరాళ్లోకి వెళ్తే... భువన్ చిత్రాంశ్ అనే వ్యక్తి డీబ్రాండ్ అనే ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్ కంపెనీ నుంచి మ్యాక్ బుక్ స్కిన్ ను కొనుగోలు చేశారు.
వెటకారం అందంగా ఉండాలి.. నవ్వు తెప్పించేలా ఉండాలి.. సరదాగా ఉండాలి.. అంతే కానీ కారం పూసినట్లు, ఒళ్లు మండినట్లు ఉండకూడదని అంటుంటారు. ఈ సమయంలో ఇలా వెటకారం ఆడిన ఒక కంపెనీ క్షమాపణలు చెప్పడంతోపాటు 10,000 డాలర్లు చెల్లించింది. దీంతో.. ఈ విషయం వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో.. వెనకా ముందూ చూసుకోకుండా వెటకారం ఆడితే ఇలానే మాడు పగిలేటంత పని అవుతుంది అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు!
అవును... ఓ భారతీయుడి పేరుపై వెటకారంగా వ్యాఖ్యలు చేసింది కెనడాకు చెందిన ఓ కంపెనీ. దీంతో... తీవ్ర విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలో.. సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోయటంతో దిగిరాక తప్పలేదు. ఫలితంగా.. దిగొచ్చి క్షమాపణలు చెప్పింది. ఇదే సమయంలో.. కొంత సొమ్ము చెల్లించి బుజ్జగించే ప్రయత్నమూ చేసింది. ఇంతా చేసి... కస్టమర్లపై జోకులు వేయడం మాత్రం ఆపబోమంటూ చెప్పడం గమనార్హం!
వివరాళ్లోకి వెళ్తే... భువన్ చిత్రాంశ్ అనే వ్యక్తి డీబ్రాండ్ అనే ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్ కంపెనీ నుంచి మ్యాక్ బుక్ స్కిన్ ను కొనుగోలు చేశారు. అయితే... ఊహించని విధంగా అది కొని రెండు నెలలు తిరగకముందే కలర్ పూర్తిగా షేడ్ అవ్వడం ప్రారంభించింది. దీంతో ఈ విషయాన్ని "ఎక్స్" వేదికగా ఫిర్యాదు చేసిన భువన్ చిత్రాంశ్... కంపెనీ అధికారిక అకౌంట్ కు ట్యాగ్ చేశారు.
దీంతో.. ఈ ట్వీట్ పై స్పందించిన ఆ సంస్థ.. అతడి పేరులోని కొన్ని అక్షరాలను మార్చి విపరీతార్థం వచ్చేలా రాసింది. దీంతో.. ఆ కంపెనీ చేసిన పనికి నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో రియాక్షన్ వచ్చింది. ఆన్ లైన్ వేదికగా ఆ కెంపెనీపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇలాంటి వెటకారపు వ్యవహారాల వల్ల భారత్ వంటి అతిపెద్ద మార్కెట్ ఇకపై మీ వస్తువులను కొనుగోలు చేయకపోవచ్చునని హెచ్చరించారు!
దీంతో డీబ్రాండ్ స్పందించింది. ఇందులో భాగంగా... కస్టమర్ పేరును ఎగతాళి చేశామని అంగీకరించింది. సదరు కస్ట్ మర్ తో పాటు నెటిజన్లనూ క్షమాపణలు కోరింది! ఈ సమయంలో... గుడ్ విల్ కింద 10,000 డాలర్లు ఆఫర్ చేసింది. అయితే.. ఇంతా చేసిన తర్వాత... ఇలా కస్టమర్లతో దాదాపు దశాబ్దకాలంగా చేస్తున్నామని దీన్ని ఆపబోమని చెప్పడం గమనార్హం! దీంతో.. మరోసారి కీప్యాడ్ లకు పనిచెబుతున్నారు నెటిజన్లు!