హారిస్ వర్సెస్ ట్రంప్... అక్రమవలసలపై హామీలు, కౌంటర్లు!

అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికాలో రసవత్తర రాజకీయం నడుస్తుంది.

Update: 2024-09-28 11:30 GMT

అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికాలో రసవత్తర రాజకీయం నడుస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ల మధ్య మాటల యుద్ధాలు పీక్స్ కి చేరుతున్నాయి. ఒకరు హామీలు ఇస్తుంటే, మరొకరు కౌంటర్లు వేస్తున్నారు. తాజాగా అక్రమవలసలపై హారిస్ కు ట్రంప్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

అవును... అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ లు పోటాపోటీగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ క్రమంలో... అరిజోనాలోని డగ్లస్ కు చెందిన యూఎస్-మెక్సికో సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... దేశంలోకి అక్రమ వలసలను నివారించేందుకు అమెరికా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేస్తానని హారిస్ పేర్కొన్నారు. ఎంతోకాలంగా అమెరికాలో నివాసముంటున్నప్పటికీ ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేని వలసదారులకు పౌరసత్వం కల్పించడానికి కృషి చేస్తానని ఆమె ప్రకటించారు.

ఈ సందర్భంగా తన ప్రత్యర్థి ట్రంప్ టాపిక్ ఎత్తిన కమలా హారిస్... డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న నాలుగేళ్లలో విచ్ఛిన్నమైన ఇమిగ్రేషన్ వ్యవస్థను సరిదిద్ధడానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదని.. విదేశీయులు దేశంలోకి అక్రమంగా ప్రవేశించకుండా ఎలాంటి చట్టబద్ధమైన మార్గాలనూ రూపొందించలేదని విమర్శించారు.

ఈ సందర్భంగా ప్రజలు.. దేశ భద్రత గురించి శ్రద్ధ వహించే వారికి తమ మద్దతు ఇవ్వాలని కోరారు. మాజీ సరిహద్దు రాష్ట్ర అటార్నీ జనరల్ గా విధులు నిర్వహించిన తనకు.. సరిహద్దు వద్ధ భద్రతపై అవగాహన ఉందని తెలిపారు.

అనంతర.. హారిస్ వ్యాఖ్యలపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన... నాలుగేళ్లుగా సరిహద్దు వద్దకు వెళ్లని హారిస్ కు ఎన్నికల వేళ అక్రమ వలసల సమస్య గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. ఈ సమస్య గురించి ఆలోచించేవారు నాలుగేళ్లుగా సరిహద్దు వద్దకు ఎందుకు వెళ్లలేదని అడిగారు.

ఈ విధంగా కమలాహారిస్, డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధాలు.. కౌంటర్లు, ప్రతి కౌంటర్లు జరుగుతున్నాయి.

Tags:    

Similar News