ఈ పర్ఫ్యూమ్ చాలా స్పెషల్.. మరొకసారి బాంబు పేల్చిన దుబాయ్ యువరాణి..

మనకు పర్ఫ్యూమ్స్ అన్న వెంటనే గుర్తుకు వచ్చే దుబాయిలో తాజాగా విడుదలైన ఈ పరిచయం సంచలనం సృష్టిస్తోంది.

Update: 2024-09-10 20:30 GMT

మనలో చాలామందికి పెర్ఫ్యూమ్స్ అంటే ఎంతో ఇష్టం. పర్ఫ్యూమ్స్ కి సంబంధించిన ఎన్నో బ్రాండ్స్ మనకు తెలుసు.. అయితే తాజాగా మార్కెట్లో విడుదలైన ఈ పర్ఫ్యూమ్ బ్రాండ్ పేరు వింటేనే పెళ్లయిన వారికి.. పెళ్లి కాని వారికి.. ఇద్దరికీ ఒక్కసారి షాక్ తగులుతుంది. ఈ పర్ఫ్యూమ్ లాంచ్ చేసింది ఎక్కడో తెలుసా?. మనకు పర్ఫ్యూమ్స్ అన్న వెంటనే గుర్తుకు వచ్చే దుబాయిలో తాజాగా విడుదలైన ఈ పరిచయం సంచలనం సృష్టిస్తోంది.

దుబాయ్ యువరాణి తన విడాకులు ప్రకటించిన కొన్ని వారాల తర్వాత మరొక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భర్త నుంచి విడిపోయిన దుబాయ్ యువరాణి విడాకులు పేరుతో సరికొత్త పెర్ఫ్యూమ్ బ్రాండ్ ని లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ పర్ఫ్యూమ్ బ్రాండ్ సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.

దుబాయ్ రాజకుమార్త..షేఖా మహ్రా అల్ మక్తూమ్ తన భర్త తో విడిపోయిన తర్వాత సరికొత్త వ్యాపారాన్ని షురూ చేస్తూ ఓ మంచి పర్ఫ్యూమ్ బ్రాండ్ ను విడుదల చేసింది.’మహ్రా ఎం’అనే పేరుతో విడుదల చేసిన ఆమె బ్రాండ్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది…ఎందుకంటే బ్రాండ్ ని ప్రమోట్ చేసే టీజర్ లో పెర్ఫ్యూమ్ పేరు విడాకులు అనే పదం చెక్కబడిన ఓ నల్లని సీసాపై ఉంది. మరొక వీడియోలో విరిగిన గాజు, నల్లని చిరుతపులి చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం దీనిపై నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

బిడ్డ పుట్టిన తర్వాత సోషల్ మీడియాలో త్రిపుల్ తలాక్ అనే ఇస్లామిక్ పదాన్ని ఉపయోగించి మహ్రా ఇంస్టాగ్రామ్ ద్వారా తన భర్తకు బహిరంగంగా విడాకులు వెల్లడించింది. అయితే ఒక యువరాణిగా ఆమె తీసుకున్న ఏ నిర్ణయం యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. తన భర్త తనని పట్టించుకోకుండా ఉండడమే దీనికి ముఖ్య కారణం అంటూ ఆమె ధైర్యంగా తన పోస్ట్ లో పేర్కొంది. 27 మే 2023న మెహ్రా కు దుబాయ్ బిజినెస్ మెన్.. షేక్ మనాబిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ తో వివాహం జరిగింది. అయితే తన భర్తకు ఇతర మహిళలతో ఎఫెక్ట్స్ ఉన్నట్టు ఆమెకు తెలియడంతో ఈ ఏడాది జూలైలో ఇంస్టాల్ వేదికగా డైవర్స్ ప్రకటించి బాంబు పేల్చింది..

‘డియర్ హస్బెండ్, మీతో ఉన్న ఇతర సహచరులతో నిమగ్నమై ఉన్నారు కాబట్టి నేను సోషల్ మీడియా ద్వారా విడాకులను ప్రకటిస్తున్నాను’అంటూ రాసిన మహ్ర.. నేను మీకు విడాకులు ఇస్తున్నాను అని మూడుసార్లు ట్రిపుల్ తలాక్ చెప్పింది. ఇక ఇప్పుడు ధైర్యంగా డైవర్స్ పేరుతో ఓ పెర్ఫ్యూమ్ బ్రాండ్ ని ప్రారంభించింది. కొందరు ఆమె తీసుకున్న డెసిషన్ ని సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News