టెక్ రంగంలో ఎలాన్ మస్క్ మరో ఇంట్రస్టింగ్ మూవ్!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం అనంతరం ఎలాన్ మస్క్ కు శుక్రమహర్ధశ మరింత బలంగా మొదలైందనే చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం అనంతరం ఎలాన్ మస్క్ కు శుక్రమహర్ధశ మరింత బలంగా మొదలైందనే చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇంతకాలం ప్రపంచంలోని టాప్ వన్ కుబేరుడిగా ఉన్న మస్క్, వ్యాపార రంగంలో దూసుకుపోతున్న మస్క్, ఇకపై యూఎస్ పరిపాలనలోనూ కీలక పాత్రను పోషించబోతున్నారు!
ఇందులో భాగంగా... అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ 2.0లో ప్రతిపాదిత డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ ద్వారా రాబోయే అమెరికా పరిపాలనలో తనదైన పాత్రను పోషించబోతున్నారు. దీంతో... ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనదైన పెర్ఫార్మెన్స్ చూపించిన మస్క్.. ఇకపై పరిపాలనలోనూ తన క్రియేటివిటీ చూపించే అవకాశాలున్నాయనే చర్చ నడుస్తుంది.
ఈ ప్రభావమో ఏమో కానీ... ప్రపంచ ఆర్థిక చరిత్రలో తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల సంపదతో దుసుకుపోతున్నారు. ఈ క్రమంలో.. ఫోర్బ్స్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం ఎలాన్ మస్క్ నికర సంపద విలువ 454.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ సమయంలో ఎలాన్ మస్క్ మరో కీలక స్టెప్ తీసుకోబోతున్నారని అంటున్నారు.
అవును... ప్రపంచ టెక్ రంగంలో "ఎక్స్" పేరుతో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఎలాన్ మస్క్.. అంతరిక్ష రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఈ సమయంలో మరో సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారని అంటున్నారు. దీంతో.. ప్రపంచ టెక్ సామ్రాజ్యంలో మరింత కీలక పాత్ర పోషించబోతున్నారని చెబుతున్నారు.
ఇందులో భాగంగా... "ఎక్స్ మెయిల్" పేరుతో కొత్త ఇ-మెయిల్ సేవలను ప్రారంభించేందుకు చర్చలు, చర్యలు మొదలుపెట్టినట్లు చెబుతున్నారు. తాజాగా ఎక్స్ వేదీక్గా.. "ఎక్స్ మెయిల్" గురించి ఓ యూజర్ చేసిన సూచనతో కూడిన ప్రశ్నకు స్పందించిన మస్క్... "అవును... చేయాల్సిన పనుల జాబితాలో ఇది కూడా ఉందని చెప్పుకొచ్చారు.
దీంతో... ఎలాన్ మస్క్ త్వరలో "ఎక్స్ మెయిల్" సేవలను కూడా ప్రారంభించబోతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. అయితే... మస్క్ కి ఉన్న అనుభవం, బ్యాక్ గ్రౌండ్ గురించి అవగాహన ఉన్నవారు.. ఇది కచ్చితంగా యాపిల్ మెయిల్, జీమెయిల్ లకు గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా... ప్రపంచ ఈ-మెయిల్ మార్కెట్ లో యాపిల్ మెయిల్ అత్యధికంగా 56 శాతం యూజర్స్ తో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుండగా.. తర్వాత స్థానంలో 32 శాతంతో గూగుల్ జీమెయిల్ కొనసాగుతుంది. ఇక తర్వాత స్థానాల్లో మైక్రోసాఫ్ట్ అవుట్ లుక్, యాహూ మెయిల్, శాంసంగ్ మెయిల్ వంటి ఇతర సర్వీసులు ఉన్నాయని అంటున్నారు.