అనాథ శవాలు ఆదాయ వనరుగా మారిన వేళ... ఏలూరులో దారుణం!

అవును... ఏలూరు గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ లోని మార్చురీలో అనాథ శవాలను కొంతమంది సిబ్బంది ఆదాయ వనరుగా మార్చుకున్నారు.

Update: 2024-10-22 08:04 GMT

ఏలూరు సర్వజన ఆస్పత్రిలోని మార్చురీకి సంబంధించి అత్యంత ఘోరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆస్పత్రిలోని మార్చురీ దారుణాలకు అడ్డాగా మారిందని తెలుస్తోంది. అక్కడున్న అనాథ శవాలను కొంతమంది సిబ్బంది ఆదాయ వనరుగా మార్చుకున్న దారుణ వ్యవహరం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ఒక ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు.

అవును... ఏలూరు గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ లోని మార్చురీలో అనాథ శవాలను కొంతమంది సిబ్బంది ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఇందులో భాగంగా గత కొంతకాలంగా ఈ హాస్పటల్ లోని మర్చురీలో ఉన్న అనాథ శవాలను గుట్టుచప్పుడు కాకుండా భారీ రేట్లకు అమ్ముకుంటున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యవహారం ఎప్పటి నుంచో సాగుతున్నట్లు చెబుతున్నారు. అయితే.. పదిరోజుల క్రితం జరిగిన ఓ ఘటనతో తీగ లాగిన అధికారులకు.. ఈ అనాథ శవాలతో చేస్తున్న అక్రమ వ్యాపారం గుట్టు రట్టు చేశారు. దీంతో... ఈ ఆస్పత్రిలోని మార్చురీ ఇక్కడున్న కొంతమంది సిబ్బంది ఆదాయ మార్గమనే విషయం వెలుగులోకి వచ్చిందని అంటున్నారు!

వాస్తవానికి ఈ ఆస్పత్రిలో అనాథ శ్వాలను భారీ రేటుకు విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా... ఏడాదిన్నర కాలంలో సుమారు 10వరకూ అనాథ శవాలను ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా చెన్నై, బెంగళూరులోని మెడికల్ కాలేజీలకు శవాలను అమ్ముతున్నట్లు చెబుతున్నారు.

ఈ మేరకు... ఒక్కో శవాన్ని సుమారు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో... ఈ ఆరోపణలపై ఏలూరు గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ విచారణ చేపట్టారు. ఈ సమయంలో... మార్చురీ అసిస్టెంట్ అశోక్ ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో... ఇంకా ఈ దందాలో ఎంతమంది ఉన్నారు.. ఎవరెవరు ఉన్నారు.. ఈ మృతదేహాలను ఎవరికి విక్రయించారు.. ఎంతకు విక్రయించారు అనే విషయాలను దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News