కాళ్లు పట్టుకున్నా కనికరించని తండ్రి.. కాలువలో ముంచేసి..

చివరికి ఏం చేయాలో తెలియక తన ఇద్దరు కూతుళ్లను చంపి తానూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఈవూరు మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

Update: 2024-11-29 08:30 GMT

ఆయనో సాధారణ విలేకరి. లగ్జరీగా బతకాలనుకున్నాడు. తాహతుకు మించి అప్పులు చేశాడు. అప్పుల వాళ్లు డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి చేశారు. చివరికి ఏం చేయాలో తెలియక తన ఇద్దరు కూతుళ్లను చంపి తానూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఈవూరు మండలంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

గుంటూరు జిల్లా ఈవూరు మండలం వనికుంటకు చెందిన తురుమెళ్ల వెంకట నాగాంజనేయ శర్మకు ఇద్దరు కూతుళ్లు యామిని (10), కావ్య(7) ఉన్నారు. ఆయన తన తాహతుకు మించి అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వారు వేధిస్తుండడంతో బతకడం వృథా అని అనుకున్నాడు. దాంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. ముందుగా తని ఇద్దరు కూతుళ్లను చంపి తరువాత తాను సూసైడ్ చేసుకోవాని అనుకున్నాడు. దీంతో కూతుళ్లను ఆస్పత్రిలో చూపించాలంటూ బైక్‌పై ముప్పాళ్ల కాల్వ మీదుగా తీసుకెళ్లాడు.

కాల్వ వద్దకు రాగానే కూతుళ్లతో సహా బైక్‌ను కాలువలోకి తీసుకెళ్లాడు. దీంతో కాలువలో పడ్డాక చిన్న కూతురు కావ్య వెంటనే మునిగిపోయింది. పెద్ద కూతురు మాత్రం కాల్వలో పైకి తేలింది. ‘నాన్నా.. నాన్నా’ అంటూ ప్రాణభయంతో తండ్రి కాళ్లు పట్టుకుంది. అయినప్పటికీ అతను కనికరించలేదు. చిన్నారిని నీటిలోనే లోపలికి నెట్టాడు. అతను మాత్రం సాఫీగా ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చేశాడు.

అదే సందర్భంలో అటువైపుగా వస్తున్న వారు ఈ ఘటనను చూసి నివ్వెరపోయారు. తన పాల వాహనాన్ని ఆపి నాగాంజనేయశర్మను నిలదీశారు. ఎవరు నువ్వు.. ఎందుకు ఇలా చేశావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను సెల్‌ఫోన్ మాట్లాడుతుండగా.. బైక్ అదుపుతప్పి కాలువలోకిదూసుకెళ్లిందని చెప్పుకొచ్చాడు. తాను జరిగిన ఘటనను చూశానని కావాలనే పిల్లలను కాలువలో ముంచేశావని అతను ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తరువాత ఆ పాల వాహనం అతను జరిగిన విషయాన్ని ముప్పాళ్లకు వెళ్లి చెప్పాడు. అయితే.. అతను అక్కడి నుంచి వెళ్లిపోగానే నాగాంజనేయ శర్మ మళ్లీ కాలువలోకి దూకాడు. కానీ.. ప్రాణం మీద తీపితో మళ్లీ ఈత కొడుతు ఒడ్డుకు చేరాడు. అక్కడ గడ్డి పరకను పట్టుకొని కేకలు వేయడంతో.. గ్రామస్తులు వచ్చి అతడిని పైకి తీశారు. అనంతరం కాల్వలో గాలింపు చేపట్టి యామిని, కావ్య మృతదేహాలను బయటకు తీశారు. కాగా.. ఇద్దరు కూతుళ్లను కావాలనే చంపిన నిందితుడు నాగాంజనేయ శర్మను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. జ్యుడిషియల్ 14 రోజుల రిమాండ్ విధించింది.

Tags:    

Similar News