హైదరాబాద్ లో దారుణం... ముగ్గురు పిల్లలతో సహా కారుతో సరస్సులోకి!
హైదరాబాద్ లో బుధవారం ఒక దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలతో సహా అత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ లో బుధవారం ఒక దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలతో సహా అత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ మేరకు ముగ్గురు పిల్లలను తీసుకుని వెళ్తూ... కారును సరస్సులోకి పోనిచ్చాడు. ఈ ఘటన హైదరాబాద్ అవుట్ కట్స్ లో జరిగింది. అయితే అదృష్టవసాత్తు వారిని స్థానికులు బయటకు తీశారు.
అవును... హైదరాబాద్ శివార్లలో ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలతో సహా కారులో ప్రయాణిస్తూ నేరుగా ఓ సరస్సులోకి పోనిచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే ఈ ఘటనను వెంటనే చూసిన స్థానికులు హుటాహుటిన రంగంలోకి దిగి.. ఆ వ్యక్తితో సహా ముగ్గురు పిల్లలను సరస్సు నుంచి బయటకు తీశారు.
వివరాళ్లోకి వెళ్తే... హైదరాబాద్ లోని బీఎన్ రెడ్డి నగర్ లో కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న అశోక్ అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు! ఈ సమయంలో తాజాగా తన కొడుకు, ఇద్దరు కుమార్తెలను వెంటబెట్టుకుని బుధవారం ఉదయం విహారయాత్రకు వెళ్లాడు. ఈ సమయంలో కారు సరస్సు వద్దకు చేరుకోగానే నీటిలోకి నడిపించాడు.
అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనాంగూడ సరస్సు వద్ద ఈ ఘటన జరిగింది. అయితే స్థానికులు తొలుత దీన్ని ప్రమాధంగా భావించారని అంటున్నారు. కానీ.. అశోక్ తన జీవితాన్ని పిల్లలతో ముగించాలనుకున్నాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిందని తెలుస్తుంది.
అశోక్ ఈ స్థాయిలో ఈ దారుణమైన నిర్ణయానికి రావడానికి ఆర్థిక సమస్యలే కారణం అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.