వైసీపీలో ఎమ్మెల్యే అవుట్... కుమార్తెకు సీటు గ్యారెంటీ...!
ఆ తర్వాత ఏమైందో ఏమో.. అనూహ్యంగా ఆయనే టికెట్ ప్రకటించుకుని.. తన కుమార్తెను రంగంలోకి దింపేశారు.
గుంటూరు రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా వైసీపీలో అప్రకటిత నాయకులు రోడ్డెక్కారు. పార్టీ తరఫు న కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో తామే పోటీ చేస్తున్నట్టు కూడా ప్రకటిం చుకుంటున్నారు. ముఖ్యంగా కొన్నాళ్లుగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముస్తఫా కుమా ర్తె దూకుడు ఎక్కువగా ఉంది. గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీ విజయం దక్కించుకుంది. ముస్తఫా ఓటు బ్యాంకు స్థిరంగానే ఉందని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా ముస్తఫా కొన్నాళ్ల కిందటనే తాను పోటీ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. ఈ స్థానంలో తన కుమార్తె ముస్తఫాకు టికెట్ ఇవ్వాలని ఆయన కోరారు. ఆ తర్వాత ఏమైందో ఏమో.. అనూహ్యంగా ఆయనే టికెట్ ప్రకటించుకుని.. తన కుమార్తెను రంగంలోకి దింపేశారు. ప్రతి అధికారిక కార్యక్రమంలోనూ కుమార్తె ఫాతిమా నూరిని వెంటేసుకుని తిరిగారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నుంచి అనేక కార్యక్రమాల్లో ఆమె భాగమయ్యారు.
ఇక, ఏ అకేషన్ వచ్చినా.. కూడా వెంటనే ఆమె నియోజకవర్గంలో కనిపిస్తున్నారు. ప్రజలకు చేరువ అవు తున్నారు. కానీ, విషయం ఏంటంటే.. ముస్తఫాను కాదంటే.. తమకు టికెట్ ఇవ్వాలని.. టీడీపీ మాజీ నాయకులు లాల్ జాన్ బాషా సోదరుడు.. వైసీపీలో ఉన్న నేత పట్టుబడుతున్నారు. ఈయన ఏడాదిన్నర కిందట టీడీపీని కాదని వైసీపీలోకి జంప్ చేశారు. అయితే.. అప్పట్లో ఏ హామీపై వచ్చారో తెలియదు కానీ.. ఆయన మాత్రం టికెట్‌పై పోరు పెడుతున్నారు.
ఈ క్రమంలో ఫాతిమాకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే ప్రచారం వ్యతిరేకంగా పుంజుకుంది. ఆమెకు టికెట్ రాదని.. పార్టీ అధిష్టానం ఇంకా ఖరారు చేయలేదని కూడా సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఇక, ఇదే విషయంపై ఫాతిమా మాట్లాడుతూ.. తనకు టికెట్ ఇస్తానని జగన్ చెప్పారని, అయితే.. కావాలని కొందరు గ్యాసిప్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. జగన్ మాట ఇస్తే.. మడమ తిప్పడని అంటున్నారు. మరి పార్టీ అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పలేదు. ఏం జరుగుతుందో చూడాలి.