పోలీసు లాఠీలకు పని తప్పించిన మోడీ!
జాతీయ స్థాయిలో ఎప్పుడూ.. హాట్ టాపిక్‌గా ఉండేది పోలీసులే. ఆ మాటకు వస్తే.. రాష్ట్ర స్థాయిలోనూ పోలీసులకు బ్యాడ్ నేమ్ ఎప్పుడూ ఉంటుంది
జాతీయ స్థాయిలో ఎప్పుడూ.. హాట్ టాపిక్‌గా ఉండేది పోలీసులే. ఆ మాటకు వస్తే.. రాష్ట్ర స్థాయిలోనూ పోలీసులకు బ్యాడ్ నేమ్ ఎప్పుడూ ఉంటుంది. చిన్నదని లేదు.. పెద్దదని లేదు.. నేరం జరిగితే చాలు.. లాఠీలకు పని చెప్పేస్తున్నారు. అందుకే.. పోలీసుల అరెస్టు అంటే.. సామాన్యులు భయపడే పరిస్థితి వచ్చేసింది. అయితే.. ఈ క్రమంలో మోడీ ప్రభుత్వం గత ఏడాది.. మూడు నేర న్యాయ చట్టాలు తీసుకువచ్చింది. దీని ప్రకారం.. పోలీసులకు లాఠీ పని తప్పించాలనేది కూడా ముఖ్య ఉద్దేశం.
తాజాగా మోడీ సర్కారు ఈ పనే చేసింది. దేశంలో అనేక నేరాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు దొంగ అంటే.. స్టయిల్ వేరేగా ఉండేది. కానీ, ఇప్పుడు దొంగలు కంటికికనిపించరు. పైగా ఉన్నత విద్య నేర్చిన దొంగ టెక్నాలజీ సాయంతో చిటికెలో లక్షలు.. కోట్లు దోచేస్తున్నారు. ఇవన్నీ పోలీసు శాఖకు ఇబ్బందిగా మారాయి. ఎంత అధునాతన వ్యవస్థ వచ్చినా.. ఈ నేరాలను కట్టడి చేయడం.. పోలీసులకు సవాలుగా మారింది. దీంతో లాఠీలకు పని చెప్పడమే మంచిదని వారు భావిస్తున్నారు.
ఇక్కడ చిత్రం ఏంటంటే.. పోలీసులు లాఠీ ప్రయోగిస్తే.. భౌతికంగా బాధితులు.. నేరస్తులు అవుతున్నారు. కానీ, మానసికంగా.. పోలీసులు కూడా బాధితులుగా మారుతున్నారట. ఓ అంతర్గత నివేదిక ఇదే స్పష్టం చేసింది. లాఠీ చార్జి చేసే సమయంలో పోలీసుల బీపీ ఊహించని స్తాయిలో పెరిగిపోయి.. వారిలో హృదయ సంబంధిత సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అంతేకాదు.. తక్కువ వయసులోనే మృతి చెందుతున్నారు.
వీటికి పరిష్కారంగా ప్రధాని మోడీ సర్కారు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుని.. వేల కోట్ల రూపాయలు కేటాయించింది. జాతీయ స్థాయిలో ఫోరెన్సిక్ మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ప్రవేశపెట్టిన పథకానికి ఆమోద ముద్ర వేసింది. దీనివల్ల పోలీసింగ్ వ్యవస్థలో లాఠీల స్థానంలో ల్యాబులు రానున్నాయి. ఆధారాలను వెలికి తీసేందేకు నేరస్తులను నిజం ఒప్పించేందుకు కూడా ఈ ఫోరెన్సిక్ దర్యాప్తు దోహద పడనుంది.
ఈ పథకంలో భాగంగా ఫోరెన్సిక్ క్యాంపస్‌లు, ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలు ఉంటాయి. దీనికి గాను మోడీ సర్కారు తక్షణం రూ.2254.43 కోట్లను కేటాయించింది. ఈ నేషనల్ ఫోరెన్సిక్ పథకంలో ఏడాదికి 9 వేల వరకూ ఫోరెన్సిక్ సైన్స్ విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. నేరస్తులను గుర్తించడం.. భౌతిక దాడులు లేకుండా.. వారితో నేరాలను ఒప్పించడం.. వంటివి లక్ష్యంగా పెట్టుకున్నారు. సో.. ఇదీ సంగతి!!