మతిమరుపును ఎలా దూరం చేసుకోవాలో తెలుసా?

మనలో చాలా మందికి మతిమరుపు ఉంటుంది. దీన్ని ఆంగ్లంలో అల్జీమర్స్ అంటారు. వయసు మళ్లిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుంది.

Update: 2023-12-09 16:30 GMT

మనలో చాలా మందికి మతిమరుపు ఉంటుంది. దీన్ని ఆంగ్లంలో అల్జీమర్స్ అంటారు. వయసు మళ్లిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుంది. మతిమరుపు రెండు రకాలుగా వస్తుందని చెబుతుంటారు. ఒకటి శారీరక సమస్యల ద్వారా మరొకటి మానసిక సమస్యల ద్వారా రావడం జరుగుతుంది. మతిమరుపు సమస్య తలెత్తితే మనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో మతిమరుపును దూరం చేసుకునే మార్గాల్లో దూరం చేసుకోవచ్చు.

మతిమరుపు అనేది కొందరిలో పుట్టుకతోనే వస్తే మరికొందరిలో వయోభారం మీద పడిన తరువాత వస్తుంది. ఇక రెండో రకలో ధ్యానం చేయడం ద్వారా జ్ణాపకశక్తి పెంచుకోవచ్చు. మతిమరుపు నియంత్రణలో ఉండాలంటే రోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. మెదడుకు మేత పెట్టే పజిల్స్, సుడోకు వంటి వాటిని సాధన చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

మెమరీకి సంబంధించిన ఆటలు ఆడటం మంచిది. జ్ణాపకశక్తిని పెంచుకునే చర్యలు చేపట్టడం, మంచి ఆహారం తీసుకోవడం, ఉల్లాసంగా ఉత్సాహంగా గడపడం, మంచి నిద్ర కూడా మతిమరుపు నివారణకు దోహదపడుతుంది. ఇలా మతిమరుపును నివారించుకునే చర్యలు తీసుకోవడం వల్ల అనుకూల ఫలితాలు రావడం సహజం. ఈనేపథ్యంలో మతిమరుపును పోగొట్టుకునే జాగ్రత్తలు పాటించి మంచి లాభాలు సాధించొచ్చు.

మతిమరుపును దూరం చేసుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. మతిమరుపు ఉంటే ఏదీ అర్థం కాదు. ఏదో చేయబోయి ఏదో చేస్తుంటారు. కొన్ని సమస్యలు కూడా రావడం ఖాయం. ఈ క్రమంలో మతిమరుపు లక్షణాలు లేకుండా చేసుకోవడానికి చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మన ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది.

మెదడును యాక్టివ్ గా ఉంచుకోవాలి. ఏవైనా చూసినప్పుడు వాటిని గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. మతిమరుపు అనే జబ్బును పోగొట్టుకునేందుకు తగిన చర్యలు తీసుకోవడం ఉత్తమం. అల్జీమర్స్ జబ్బును పోగొట్టుకోవడానికి కావాల్సిన పనులు చేసుకోవడం వల్ల కొంతవరకైనా మంచి ఫలితాలు రావడం జరుగుతుంది.

Tags:    

Similar News