కెనడాలో నిజ్జర్.. అమెరికాలో పన్నూ.. మన ‘రా’ పైనే కన్ను?

ఇప్పుడు ఇతడి హత్యనే భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలను ఎన్నడూ లేనంత కనిష్ఠానికి దిగజార్జింది.

Update: 2024-10-18 08:34 GMT

హర్దీప్ సింగ్ నిజ్జర్.. కెనడాలో గత ఏడాది హత్యకు గురైన ఖలిస్థానీ సానుభూతి పరుడు. ఇప్పుడు ఇతడి హత్యనే భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలను ఎన్నడూ లేనంత కనిష్ఠానికి దిగజార్జింది. కెనడా కేంద్రంగా ఖలిస్థానీ అనుకూల కార్యకలాపాలకు పాల్పడుతున్న నిజ్జర్ ను చంపేయడంతో ఈ పని చేసిందెవరా? అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే, దాదాపు అదే సమయంలో మరో ఖిలిస్థానీ గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకూ కుట్ర జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి.

అతడు అక్కడ.. ఇతడు ఇక్కడ..

నిజ్జర్ కార్యస్థానం కెనడా అయితే.. పన్నూది అమెరికాది. అందుకే పన్నూపైన హత్యాయత్నం జరిగిందన్న ఆరోపణలపై అమెరికా దర్యాప్తు జరుపుతోంది. అమెరికానే రంగంలోకి దిగితే ఇక దానికి తమ ప్రాధాన్యాలు తప్ప వేరేమీ పట్టవు. ఇందులో భాగంగానే భారత్ కు చెందిన నిఖిల్‌ గుప్తా అనే వ్యక్తిపై అభియోగాలు మోపింది. ఇప్పుడు మన మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారిపైనా అభియోగాలు నమోదు చేసింది.

హత్య కుట్ర వెనుక అతడేనట..

పన్నూ హత్య కుట్ర వెనుక ఉన్నది భారత్ కు చెందిన రా మాజీ అధికారి అని.. అతడే దీనికి డైరెక్టర్ అని అమెరికా న్యాయశాఖ అభియోగాల్లో పేర్కొంది. ఈ మేరకు న్యూయార్క్‌ కోర్టులో చార్జి షీట్‌ వేసింది. ఇందులో పేర్కొన్న పేరు వికాస్‌ యాదవ్‌ (39). ఈయనపై నగదు అక్రమ చెలామణీ, కుట్రకు వ్యక్తులను నియమించడం, పన్నూ హత్యకు ప్రణాళిక అభియోగాలను మోపింది. వికాస్ ఎక్కడున్నదీ తెలియడం లేదని పేర్కొంది. వికాస్‌ భారత ప్రభుత్వ మాజీ అధికారి. విదేశీ ఇంటిలెజెన్స్‌, రా విభాగాలలను నిర్వహించే కేబినెట్‌ సెక్రటేరియట్‌ లో ఉద్యోగం చేశారు.

పంటికింది పన్నూ

నిజ్జర్ హత్య జరిగిన సమయంలోనూ తమ దేశంలో పన్నూ హత్యకూ కుట్ర జరిగిందని.. అయితే, దాన్ని తాము విచ్ఛిన్న చేశామని అమెరికా ఆరోపించింది. దీనికి భారత ప్రభుత్వ ఉద్యోగితో కలిసి నిఖిల్‌ కుట్ర పన్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. నిఖిల్‌ ను చెక్‌ రిపబ్లిక్‌ జైలు నుంచి అమెరికాకు అప్పగించారని కథనాలు వచ్చాయి. అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు కూడా ఇచ్చింది. వీటిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపేందుకు స్వదేశంలో వేస్తామని మాత్రం చెప్పిం. అమెరికా అభియోగాల్లో పేర్కొన్న అధికారి ప్రస్తుతం తమ ప్రభుత్వంలో పనిచేయడం లేదని అమెరికాకు చెప్పింది. అయితే, ఇదంతా అయిన తర్వాతే వికాస్‌ యాదవ్‌ పై అమెరికా అభియోగాలు మోపడం గమనార్హం.

Tags:    

Similar News