దీపావళి వేళ టపాసుల కాల్చటంపై హైదరాబాదీయులకు ఆంక్షలు

ఉత్సాహంతో టపాసుల్ని పెద్ద ఎత్తున కాల్చాలనుకున్న వారికి పరిమితులు విధిస్తూ తాజాగా పోలీసులు డిసైడ్ చేశారు.

Update: 2024-10-27 08:34 GMT

దీపావళి వేళ హైదరాబాదీయుల పండుగ ఉత్సాహంపై నీళ్లు జల్లారు. ఉత్సాహంతో టపాసుల్ని పెద్ద ఎత్తున కాల్చాలనుకున్న వారికి పరిమితులు విధిస్తూ తాజాగా పోలీసులు డిసైడ్ చేశారు. ఎక్కువ శబ్దంతో వచ్చే టపాసుల్ని కాల్చకూడదని.. దీనికి సంబంధించిన మార్గదర్శకాల్ని హైదరాబాద్ నగరపోలీసులు పేర్కొన్నారు. దీపావళి రోజున బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాల్చటం.. రోడ్ల మీద అధిక ధ్వనులు వచ్చేక్రాకరస్ ను పేల్చకూడదని చెప్పారు.

అంతేకాదు.. హైదరాబాద్ మహా నగర వాసులు పండుగ రోజు రాత్రి 8 గంటలకు క్రాకర్స్ కాల్చటం మొదలు పెట్టి పది గంటల్లోపు ముగించేందుకు అనుమతిచ్చారు. అనుమతి తర్వాత టపాసులు కాల్చటంపై నిషేధం ఉంటుందన్నారు. అంతేకాదు.. సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిబెల్స్ నిబంధనను అతిక్రమించకూడదని స్పష్టం చేశారు. శబ్ద కాలుష్య కంప్లైంట్ల కోసం డయల్ 100కు ఫోన్ చేయొచ్చని చెప్పారు.

దీపావళి వేళ క్రాకర్స్ కాల్చటంపై ఉన్న పరిమితులకు లోబడి ప్రజలు వ్యవహరించాలన్నారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు ఆదేశాల్ని పాటించకుండా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. టపాసులు అమ్మే షాపు యజమానులు ఎవరైనా సరే.. లైసెన్సు లేకుండా అమ్మొద్దని స్పష్టం చేశారు. సో.. దీపావళి వేళ.. క్రాకర్స్ కాల్చలనుకునే ఎవరైనా సరే.. పోలీసుల పరిమితులకు లోబడి ఉండాలన్న విషయాన్ని మర్చిపోకూడదు.

Tags:    

Similar News