ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కీలక పరిణామం... వాట్ నెక్స్ట్?

దీంతో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పై కోర్టులో విచారణ జరిగింది. తెలుగుదేశం హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో పలు అక్రమాలు ఉన్నాయి సీఐడీ కేసు నమోదు చేసింది.

Update: 2023-12-23 09:15 GMT

టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ లోనూ, అమరావతి రాజధాని చుటూ గీసిన ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్ మెంట్ లోనూ, ఏపీ ఫైబర్ నెట్ లోనూ భారీ స్కాం లు జరిగాయంటూ ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో సుమారు 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ముందస్తు బెయిల్ కు ధరఖాస్తు చేస్తుకున్నారు. దీంతో ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.

అవును... టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ కేసులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు తర్వాత ప్రధానంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో అవకతవకలు జరిగాయంటూ చంద్రబాబు పైన సీఐడీ అభియోగాలు నమోదు చేసింది! దీంతో... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసు అనుభవాలను దృష్టిలో పెట్టుకునో ఏమో కానీ... ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

దీంతో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పై కోర్టులో విచారణ జరిగింది. తెలుగుదేశం హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ లో పలు అక్రమాలు ఉన్నాయి సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో భాగంగా తమ స్వార్ధ ప్రయోజనాల కోసమే ఐ.ఆర్.ఆర్. అలైన్ మెంట్ ను మూడుసార్లు మార్పు చేసారని ఏపీ సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. తద్వారా లింగమనేని రమేష్ కుటుంబంతో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ క్విడ్ ప్రోకో కు పాల్పడ్డారని పేర్కొంది.

ఈ సమయంలో ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పైన కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో... చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్‌ చేసింది. కాగా... ఇటీవలే ఈ పిటిషన్‌ పై విచారణ ముగియగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం తాజాగా తీర్పును రిజర్వ్‌ చేసింది.

కాగా... సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పైన తీర్పు వెల్లడి కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన వాదనలు పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు ఆ కేసుకు సంబంధించిన తీర్పు రిజర్వ్ చేసింది. సుప్రీం ఇవ్వనున్న ఆ తీర్పు చంద్రబాబుపై ఏపీ సీఐడీ పెట్టిన కేసుల్లో అత్యంత కీలకం కానుంది!

Tags:    

Similar News