గుండెలు అదిరేలా వయనాడ్ విలయాన్ని చూపిన మూడో కన్ను!

వయనాడ్ విలయం ఎంత పెద్దదన్న విషయాన్ని శాస్త్రీయంగా చెప్పే చిత్రాలు బయటకు వచ్చాయి

Update: 2024-08-02 05:07 GMT

వయనాడ్ విలయం ఎంత పెద్దదన్న విషయాన్ని శాస్త్రీయంగా చెప్పే చిత్రాలు బయటకు వచ్చాయి. అంతరిక్షం నుంచి ఇస్రో శాటిలైట్ తీసిన చిత్రాల్ని చూసినప్పుడు ఈ విలయం ఎంత తీవ్రమైనదన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. భారీగా కొండ చరియలు విరిగి పడి.. 250 మంది ప్రాణాల్ని తీసిన ఈ విపత్తులో మరింత మంది కొండచరియల శిథిలాల కిందే చిక్కుకుపోయారు. మరో 240 మంది గల్లంతయ్యారు. 200 మంది వరకు గాయపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్ ద్వారా బుధవారం నాటికి వెయ్యి మందిని రక్షించారు.

గురువారం కూడా పెద్ద ఎత్తున బండరాళ్లను తొలగించారు. అయితే.. నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. విలయానికి ముందు.. విలయం తర్వాత మధ్య వ్యత్యాసం ఎంతన్నది త్రీడీ రూపంలో చూస్తే గుండెలు అదరాల్సిందే. శాటిలైట్ చిత్రాలను పరిశీలించినప్పుడు కొండచరియలు విరిగిపడిన ఉదంతంలో దాదాపు 86 వేల చదరపు మీటర్ల భూభాగంగా జారిపోయింది.

సముద్ర మట్టానికి 1550 మీటర్ల ఎత్తులో ఉన్న కొండచరియలు విరిగి పడిన ప్రదేశాన్ని శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తించారు. విరిగి పడిన కొండ చరియలు ఇరువంజిపుళ నదిలో దాదాపు ఎనిమిది కిలోమీటర్ల మేర కొట్టుకుపోతున్న వైనం చూస్తే.. ఈ విలయం ఎంత పెద్దదన్నది ఇట్టే అర్థమవుతుంది. అరేబియా సముద్ర తీరంలో దట్టమైన మేఘాల ధోరణిని సైంటిస్టులు ముందుగానే గుర్తించారు. ఈ దట్టమైన మేఘాలే ఈ పెను విషాదానికి కారణమయ్యాయి.

అతి తక్కువ వ్యవధిలో అత్యంత భారీ కుండపోతకు కారణమైంది. ఇదే.. అక్కడి కొండ చరియలు విరిగిపడే అవకాశాల్ని మరింత పెంచింది. ఈ ఘోర దుర్ఘటనకు రెండు వారాల ముందు వయనాడ్ ప్రాంతం మొత్తం తడిగా మారిన విషయాన్నిఅడ్వాన్స్ డ్ సెంటర్ ఫర్ అట్మాస్ ఫెరిక్ రాడార్ రిసెర్చ్ అండ్ టెక్నాలజీ నిపుణులు పేర్కొన్నారు. ఇస్రోకు చెందిన కార్టోశాట్ 3, ఆర్ఐఎస్ ఏటీ అత్యాధునిక ఉపగ్రహాలను నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్.. ఈ ఘోర ఘటన జరిగిన ప్రాంతాలను అంతరిక్షం నుంచి తీసిన త్రీడీ చిత్రాలతో విశ్లేషించింది. అంతేకాదు.. ఇదే ప్రాంతంలో గతంలోనూ కొండచరియలు విరిగిపడిన విషయాన్ని గుర్తించారు.

వయనాడ్ లో పెను విషాదానికి గురైన రెండు గ్రామాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అందుకు అనుగుణంగా అక్కడి నెట్ వర్క్ సామర్థ్యాన్ని పెంచాలని జియో నిర్ణయించింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారుల వినతితోఆ ప్రాంతంలో ప్రత్యేక టవర్ ను ఏర్పాటు చేసింది. బాధితులనుత్వరగా కాపాడి.. సురక్షిత ప్రాంతాలకుపంపేందుకు కీలకమైన మొబైల్ నెట్ వర్కు వేగాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు వయానాడ్ లో ప్రీపెయిడ్ మొబైల్ సేవలు గడువు ముగిసిన వినియోగదారులకు నిరంతర కనెక్టివిటీనిఅందించేందుకుమూడు రోజుల పాటు రోజుకు ఒక జీబీ ఉచిత మొబైల్ డేటా.. అపరిమితమైన కాలింగ్.. రోజుకు వంద మెసేజ్ లు పంపేందుకు వీలుగా ఎయిర్ టేల్ నిర్ణయం తీసుకుంది. అక్కడున్న దుర్బర పరిస్థితుల్లో రీఛార్జ్ చేయలేనిపరిస్థితులు ఉండటంతో సదరు సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లు సైతం తమ బిల్లుల్నినెల తర్వాత చెల్లించేలా నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News