అంబానీ కుమారుడు పెళ్లి ఖర్చు ఇంతేనా?

అంబానీ కుమారుడి పెళ్లి అంటే మాటలా.. నభూతో న భవిష్యతి అనే రేంజులో ఆయన కుమారుడు అనంత్‌ పెళ్లి జరిగింది.

Update: 2024-07-14 09:46 GMT

ప్రపంచంలోని టాప్‌ టెన్‌ అపర కుబేరుల్లో ఒకరు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం హాట్‌ టాపిక్‌ గా మారిన సంగతి తెలిసిందే. దేశ విదేశాలకు చెందిన వీవీఐపీలు, వ్యాపార దిగ్గజాలు, రాజకీయ ప్రముఖులు, వివిధ రాష్ట్రాలకు చెందిన చిత్ర పరిశ్రమల ప్రముఖులు, హాలీవుడ్‌ స్టార్లు, పాప్‌ సింగర్లు, వరల్డ్‌ టాప్‌ మోస్ట్‌ డ్యాన్సర్లు, కళాకారులు.. ఇలా ఒకరేమిటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలుకుని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు ముంబైలో అంబానీ కాంపౌండ్‌ లో వాలిపోయారు.

అంబానీ కుమారుడి పెళ్లి అంటే మాటలా.. నభూతో న భవిష్యతి అనే రేంజులో ఆయన కుమారుడు అనంత్‌ పెళ్లి జరిగింది. ఈ వేడుకకు ఎంత ఖర్చు పెట్టి ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే జూలై 12 నుంచి 14 వరకు జరిగిన ఈ వివాహ వేడుకలకు రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టి ఉంటారని టాక్‌ నడుస్తోంది.

ముకేశ్‌ అంబానీ ఆస్తులు రూ.10 లక్షల కోట్ల పైమాటే. అందులో రూ.5 వేల కోట్లు అంటే.. కేవలం 0.5 శాతమేనని అంటున్నారు. ఈ మొత్తం సగటు భారతీయులు తమ వివాహాలకు ఖర్చు పెట్టుకునేదాని కంటే తక్కువ మొత్తమేనని అంటున్నారు. మనదేశంలో రూ.1 కోటి ఆస్తులు ఉన్నవారు తమ పిల్లల పెళ్లిళ్లకు కనీసం రూ.15 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారని చెబుతున్నారు.

ముకేశ్‌ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ పెళ్లికి చేసిన ఖర్చు వివరాలు జాతీయ మీడియా ప్రకారం..

వివాహానికి ముందు జామ్‌ నగర్‌ వేడుకలు (మార్చి):

రిహన్న ప్రదర్శన: జామ్‌ నగర్‌ వేడుకల్లో పాడేందుకు బార్బాడియన్‌ పాప్, రిథమ్‌–అండ్‌–బ్లూస్‌ సింగర్‌ కు రూ.74 కోట్లు చెల్లించినట్లు తెలిసింది.

అతిథులు: 1,200 మంది అతిథులలో బిల్‌ గేట్స్, ఇవాంకా ట్రంప్, మెటా అధినేత మార్క్‌ జుకర్‌ బర్గ్‌ వంటివారు ఉన్నారు.

ప్రీ–వెడ్డింగ్‌ లగ్జరీ యూరోపియన్‌ క్రూయిజ్‌ (మే): వార్తాపత్రిక ది గార్డియన్‌ అంచనా ప్రకారం ఈ క్రూయిజ్‌ ధర సుమారు రూ. 1,253 కోట్లు.

క్రూయిజ్‌లో ప్రదర్శకులకు చెల్లించింది..

– కేటీ పెర్రీ (రూ. 45 కోట్లు)

– బ్యాక్‌ స్ట్రీట్‌ బాయ్స్‌ (రూ. 5–7 కోట్లు)

– ఆండ్రియా బోసెల్లి

– పిట్‌ బుల్‌

– షకీరా (రూ. 15 కోట్లు)

అతిథులు: దాదాపు 800 మంది హాజరయ్యారు

సంగీత్‌ (జూలై 5):

జస్టిన్‌ బీబర్‌: అనంత్‌ అంబానీ సంగీత్‌ లో ప్రదర్శన ఇవ్వడానికి కెనడియన్‌ పాప్‌ స్టార్‌ జస్టిన్‌ బీబర్‌ కు రూ. 83.53 కోట్లు చెల్లించినట్టు తెలుస్తోంది.

ఆహ్వానాలు: మోడల్‌ వెండి ఆలయం, బహుమతులు, చేతితో తయారు చేసిన పాష్మినా శాలువాతో అలంకరించబడిన ఎరుపు పెట్టెలో వివాహ ఆహ్వానాలు గత నెలలో çపంచారు. ఒక్కో ఆహ్వానానికి దాదాపు రూ.7.5 లక్షలు ఖర్చు చేశారని అంచనా.

ప్రైవేట్‌ జెట్‌లు: అంబానీలు వివాహ అతిథులను తీసుకెళ్లేందుకు మూడు ఫాల్కన్‌–2000 జెట్‌లను అద్దెకు తీసుకున్నారు. ఈవెంట్‌ ల కోసం 100–ప్లస్‌ ప్రైవేట్‌ విమానాలను ఉపయోగించారని సమాచారం.

అంబానీ కుటుంబ ఇంటి అలంకరణలు: ముంబైలోని అంబానీ యొక్క 27–అంతస్తుల భవనం.. ఆంటిలియాను బంతి పువ్వులు, దీపాలతో అలంకరించారు.

Tags:    

Similar News